- అర్చకుల వేతనాలు 35వేలకు పెంచాలి
- హెల్త్ కార్డుతో పాటు, ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలి
- అర్చక భవనం ఏర్పాటుకు నిధులు కేటాయించాలి
నల్లగొండ, ఏపీబీన్యూస్: దూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపపడుతున్న అర్చక చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం నల్లగొండ లో ఉమ్మడి జిల్లా అర్చకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలాతబాద్ వాసుదేవ శర్మ మాట్లుడూతు, అర్చకుల వేతనాలు 35 వేలకు పెంచాలని, హెల్త్కార్డు లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్చకులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండలో పానగల్లు వద్ద అర్చక భవనానికి కేటాయించిన 20 గుంటల స్థలంలో భవనం నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరారు. తమ సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పగిడిమర్రి ప్రసాద్ శర్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయం మాజీ చైర్మన్ ఆర్ ఎస్ ఎల్ ఎన్ శర్మ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంబొట్ల ఫణికుమార్ శర్మ రాష్ట్ర కన్వీనర్ అమరేశ్వర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.