Video: తిప్పర్తిలో ఘనంగా అహింసా మహా కరుణ శాకాహార ర్యాలీ..

తిప్పర్తి / నల్గొండ, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీలో నల్గొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ (PSSM) మరియు తిప్పర్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో “అహింసా మహా కరుణ శాకాహార ర్యాలీ” అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించబడింది. జీవుల పట్ల దయ, అహింసను చాటడంతో పాటు శాకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై గ్రామ ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించారు.

ఈ మహా శాకాహార ర్యాలీని శ్రీమతి గుండ సరోజనమ్మ జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ, కోదాడ, చండూరు, నకిరేకల్లు, సూర్యాపేట తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు తరలివచ్చారు. తిప్పర్తి గ్రామ వీధులన్నింటిలో తిరిగి శాకాహారం యొక్క విశిష్టతను చాతుతూ గ్రామ ప్రజలకు శాకాహార సద్భావన సందేశాన్ని అందించారు.

నిర్వాహకులు: నల్గొండ మరియు తిప్పర్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ (PSSM).

సారథ్యం: శ్రీ గరికపాటి సుబ్రహ్మణ్యం (జీవనవనం పిరమిడ్ ధ్యానక్షేత్రం, మమ్ముదాపురం), శ్రీ దొన్నాదుల సతీష్ బాబు (సాగర్) ఆధ్వర్యంలో కొనసాగింది.

ప్రధాన ఉద్దేశం: శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలపై అవగాహన కల్పించడం.

ముగింపు వేదిక: తిప్పర్తి స్థానిక కృషి ఫంక్షన్ హాల్లో ఘనంగా ముగింపు సభ.

శాకాహార అలవాట్లతో మనిషి శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయని పిరమిడ్ మాస్టర్లు వివరించారు. ఈ ర్యాలీ తిప్పర్తి వీధుల గుండా సాగుతుండగా స్థానికులు విశేష స్పందన కనబరిచారు.

ర్యాలీ అనంతరం స్థానిక కృషి ఫంక్షన్ హాల్లో ముగింపు సభ వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి గ్రామ ప్రముఖులు నలపరాజు శ్రీనివాస్, నల్గొండ జిల్లా పియస్ఎస్ఎం గౌరవాధ్యక్షులు భూసాని జగదీశ్వర్ రెడ్డి, భూసాని కృష్ణారెడ్డి, అనంతల సత్యనారాయణ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మంచుకొండ నాగరాజు, తిప్పర్తి వాసవి క్లబ్ సభ్యులు శ్రీనివాస్ (@ వాసు, శ్రీరామ షాప్), బ్రహ్మదేవర అశోక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మిర్యాలగూడ పట్టణ PSSM తరపున కర్నాటి రాంబాబు, డాక్టర్ అంజయ్య, వాసుదేవరావు మరియు మిర్యాలగూడ బృందం, శ్రీలలితా తో పాటు ఎంతో మంది ఉత్సాహవంతమైన పిరమిడ్ మాస్టర్లు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ర్యాలీని దిగ్విజయం చేశారు.

Share
Share