- ఒకేసారి 37 మంది నటుల రియల్ టైమ్ ‘మోషన్ క్యాప్చర్’తో సరికొత్త చరిత్ర..
- గిన్నీస్ రికార్డు సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రాకా’ (Raka) భారతీయ చలనచిత్ర రంగాన సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదల కాకముందే ఈ సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి, ప్రతిష్టాత్మక ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ (Guinness World Records) లో స్థానం సంపాదించుకుంది.
ఈ చారిత్రాత్మక రికార్డుకు సంబంధించిన అధికారిక సర్టిఫికేట్‌ను గిన్నీస్ రికార్డ్స్ ప్రతినిధుల నుంచి హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సమక్షంలో చిత్రబృందం అందుకంది.
ఏమిటీ సరికొత్త గిన్నీస్ రికార్డు?
సినిమా నిర్మాణ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ సాధించని విధంగా.. రియల్ టైమ్‌లో ఒకే ఫ్రేమ్‌లో ఏకంగా 37 మంది నటులకు ‘మోషన్ క్యాప్చర్’ (Motion Capture Technology) చేసి ‘రాకా’ మూవీ టీమ్ ఈ అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మరియు అత్యాధునిక విఎఫ్ఎక్స్ (VFX) టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ రికార్డు స్థాయిలో విజువల్ వండర్‌ను ఆవిష్కరించినట్లు మేకర్స్ వెల్లడించారు.
గతంలో హాలీవుడ్ చిత్రాల్లో కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే ఒకేసారి మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించగా, భారతీయ సినిమాలో ఒకే సమయంలో 37 మంది నటులపై లైవ్ మోషన్ క్యాప్చర్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
‘రాకా’ గిన్నీస్ రికార్డ్ – ప్రధాన విశేషాలు:
సాంకేతిక మైలురాయి: రియల్ టైమ్‌లో ఒకేసారి 37 మంది నటుల మోషన్ క్యాప్చర్ (Motion Capture) నిర్వహణ.
ప్రపంచ రికార్డు: అత్యధిక మంది నటులతో మోషన్ క్యాప్చర్ చేసిన చిత్రంగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో నమోదు.
సర్టిఫికేట్ అందజేత: గిన్నీస్ సంస్థ ప్రతినిధుల నుంచి సర్టిఫికేట్ అందుకని హర్షం వ్యక్తం చేసిన అల్లు అర్జున్, అట్లీ, నిర్వాహకులు.
భారతీయ సినిమా సత్తా చాటిన అల్లు అర్జున్ – అట్లీ
గిన్నీస్ రికార్డు సాధించడం పట్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విప్లవాత్మక దర్శకుడు అట్లీ ఆనందం వ్యక్తం చేశారు. “భారతీయ సినిమా విజువల్ స్టాండర్డ్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశాం. ఈ గిన్నీస్ రికార్డు మా చిత్రబృందం పడ్డ కష్టానికి దక్కిన గొప్ప గౌరవం” అని దర్శకుడు అట్లీ తెలిపారు.
ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ‘రాకా’ టీమ్‌కు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.