పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ నడి బొడ్డున ఉన్న ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని గుర్తు తెలియని కొందరు దుండగులు నిప్పుటించారు. విశ్వనీయ సమచారం మేరకు శనివారం తె ల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో కొందరు దుండగులు నల్లగొండ పట్టణంలోని ఎన్టీఆర్ జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి నిప్పుటించినట్టు తెలిసింది. శనివారం పొద్దున్నే విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ సిబ్బంది తక్షణమే ఆఫీసర్లకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్(NTR) విగ్రహానికి వెంటనే రంగులు వేయించి, పూలమాలలతో ఆవిష్కరించారు. నిందితులు ఎవరనేది పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ తెలంగాణలో జనసేన సభ పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించక పోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించడం, ఇందిరా, ఎన్టీఆర్ ల స్పూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం వ్యాఖ్యల పైన కరుడుగట్టిన కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తగలబెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
దుండగులను కనిపెట్టేందుకు వన్ టౌన్ పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీ(CC) కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జంక్షన్, ఎన్జీ(NG) కాలేజీ, బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలు చాలా కాలం నుంచి పని చేయడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూతవేటు దూరంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జరిగిన సంఘటన పైన విచారణ చేస్తున్నామని వన్ టౌన్ ఎస్ఐ(SI) సైదులు ఏపీబీకీ తెలిపారు.
Breaking News: నల్లగొండలో ఎన్టీఆర్(NTR) విగ్రహాన్ని తగులబెట్టిన దుండగులు..