- చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సెటిల్ సర్వీసులు బంద్ చేయాలి
- అమరావతి బ్రహాండం అని చెబితే చాలదు
- హైదరాబాద్ లో కాకుండా అమరావతిలోనే నివసించాలి
- తెలంగాణలో ఉంటాం.. ఇక్కడే సంసారం చేస్తాం అంటే కుదరదు
- తెలంగాణ ప్రజలకు ఓపిక ఎక్కువ.. సహనం దాటితే ఉద్యమే: మండలి చైర్మన్ గుత్తా ఘాటైన వ్యాఖ్యలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రహాండం అని చెబితే చాలదని అది నిరూపతం కావలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆఫీసర్లు అందరూ అక్కడే నివసించాలని అప్పుడే రాష్ట్ర రాజధానికి గుర్తింపు లభిస్తదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పైన ఘాటుగానే స్పందించారు. హైదరాబాద్ లో సంసారం చేస్తాం.. తెలంగాణలోనే ఉంటాం అంటే కుదరదని సెటిల్ సర్వీసులు బంద్ చేసి అమరావతిలో నివసించాలని సూచించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ లో 750 కిలోమీటర్ల సముద్రతీర ప్రాతం ఉందని, వివిధ రకాల పోర్టులు ఉన్నాయని, చాలా నగరాల్లో విమనాశ్రయాలు ఉన్నాయని అన్నారు. చెప్పే మాటలు ఒకచోట, నివాసం మరొక చోట ఉంటే రాజధాని అభివృద్ధికి దోహద పడదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఓపిక ఎక్కువ అని, దేన్ని అయినా భరించే శక్తి ఉందని, కానీ ఓపిక నశించి తెలంగాణ ఉద్యమం పుట్టకొచ్చిందని, కేసీఆర్ తో పాటు, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా మేమంతా ఏకమై కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే తెలంగాణ వచ్చిందని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, సోనియా ఆలస్యం చేయడం వెనక రాజకీయంగా కొన్ని కారణాలు ఉన్నాయని, యూపీఏ గవర్నమెంట్ పడిపోకుండా కాపాడుకునే క్రమంలో ఓపికతో వ్యవహారించారని, దాంతోనే 5 ఏళ్ల పాటు రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని చెప్పారు. తెలంగాణకు నాటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా మద్ధతు తెలిపారని గుర్తు చేశారు. నాడు బీజేపీ కాకినాడలో సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిందని, ఇప్పుడేమో రాష్ట్ర విభజన పైన అధికారంలో ఉన్న బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోందని, జాతీయ పార్టీగా బీజేపీ నాడు రాష్ట్ర ఏర్పాటును సమర్ధించిందని, ఇప్పుడు నాయకులు మారినంత మాత్రాన విధానాలు మారవని చెప్పారు.
వడ్ల సేకరణలో కేంద్రం వ్యవహారిస్తున్న తీరు సరిగా లేదని, బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ లు కేంద్ర మంత్రిని కలవడం జరిగిందని, సరియైన సమయంలో కేంద్రం స్పందించలేదని గుత్తా అన్నారు. దేశంలో వరికి మద్ధతు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇక్కడ రైస్ మిల్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి 1400లకే వడ్లు కొనుగోలు చేస్తున్నారని, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకుండా రూ. 50వేల కోట్లు అప్పు చేసి మరీ మద్ధతు వడ్లు కొనుగోలు చేస్తున్న విషయాన్ని రైతులు గుర్తించాలని అన్నారు. ఇప్పటికైన పంట మార్పిడి పద్ధతులు అవలంభించాలని, వరి, పత్తి పంటలే గాక, పప్పుధాన్యాల సాగు పెంచాలని మండలి చైర్మన్ గుత్తా కోరారు. ఉచిత సన్న బియ్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బీపీఎల్(BPL), ఏపీఎల్(APL) కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినట్టు చైర్మన్ సుఖేందర్ రెడ్డి కోరారు.
Breaking News: చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై.. మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు