నల్లగొండ: పది ఫలితాల్లో బాలికలదే టాప్..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నల్లగొండ జిల్లా మంచి ఫలితాలు నమోదు చేసింది. జిల్లాలో మొత్తం 98.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించిన పరీక్షల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా మొత్తం 19,667 మంది విద్యార్థుల్లో 19,366 మంది (98.47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా 10వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 333 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 125 పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో 139 పాఠశాలలు మంచి ఫలితాలు నమోదు చేశాయి.

బాలురు 10,131 మంది హాజరుకాగా, అందులో 9,949 మంది (98.2 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9,536 మంది హాజరుకాగా, అందులో 9,417 మంది (98.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 333 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి.

Share
Share