SSC ఫలితాల్లో నారాయణ స్కూల్ ప్రభంజనం: విద్యార్థుల అద్భుత ప్రతిభ..

హస్తినాపురం, ఏపీబీ న్యూస్: ఇవాళ విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో హస్తినాపురంలోని నారాయణ స్కూల్ అసాధారణమైన విద్యా ప్రతిభను చాటింది. క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్థుల కృషి వెరసి ఈ ఏడాది పాఠశాల రికార్డు స్థాయి మార్కులను సొంతం చేసుకుంది.

విద్యార్థి పేరుసాధించిన మార్కులు (600 కి)
బి. చందన591
బి. శ్రీ శరణ్య588
యం. యవన్ గౌడ్586
టీ. శ్రీ ప్రణవి584
సి. కోవిధ583
బి. ప్రణీత్ రెడ్డి581
ఊహశ్రీ581

కేవలం టాపర్లు మాత్రమే కాకుండా, మెజారిటీ విద్యార్థులు అత్యుత్తమ గ్రేడ్లతో ఉత్తీర్ణులయ్యారు:

550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు: 46 మంది

500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు: 120 మంది

ఈ గొప్ప విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ శారద గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి తోడ్పడిన జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం హేమాంబార్, ఆర్ఐ రవిప్రసాద్, ఆర్ అండ్ డి హెడ్ శివరంజిని మరియు అకాడెమిక్ డీన్ శ్రీదేవి సహా ఉపాధ్యాయ, ఉపాధ్యేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పదవ తరగతి రాష్ట్ర ఇన్ఛార్జ్ ముంతాజ్, కోఆర్డినేటర్లు శరత్, అనిల్ కుమార్, ఏఓ రాజేష్, కరుణాకర్ ల పర్యవేక్షణలో విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

Share
Share