- రెండో స్థానంలో షేక్ ముస్లింలు, మూడో ప్లేస్‌లో యాదవ, గౌడ కులాలు
- మాలలు సెకండ్, లంబాడ ఫస్ట్
- అగ్రవర్ణాల్లో రెడ్లు టాప్, కమ్మ, ఇతరులు సెకండ్
- 12 నియోజకవర్గాల్లో బీసీల ప్రభావం
- తుంగతుర్తి, నల్లగొండలో ఎస్సీ మాదిగలు
- దేవరకొండ, సాగర్‌లో ఎస్టీ లంబాడ
- మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడలో రెడ్లు అధికం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5,06,000 (12-14శాతం) జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి సమచారాన్ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది, ఉపకులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 4,41,000 (11–13శాతం) మందితో ముదిరాజ్ కులం జనాభా పరంగా బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా అవతరించింది. మూడో స్థానంలో 3,32,000 మంది (9-11శాతం)తో మున్నూరు కాపు కులం స్థానం సంపాధించింది. వెనకబడిన తరగతుల్లో యాదవులు 2,75,000 (6-8శాతం), గౌడ కులం 2,35,000 (5-7శాతం), షేక్ ముస్లింల కులం 2,88,000 (6-8శాతం) మందితో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇతర కులాల గణాంకాలు…
మాదిగల తర్వాత మాలలు 2,72,000 (6-8శాతం) మంది ఉండగా, ఎస్టీల్లో లంబాడ కులం 3,78,000 (10-12శాతం), ఇతర కులాలు 96 వేల జనాభా ఉంది.
అగ్రవర్ణాల్లో రెడ్లు టాప్…
రెడ్ల ఆధిపత్యం కలిగిన జిల్లాలో అగ్రవర్ణాల్లో ఆ కులానిదే అప్పర్ హ్యాండ్. ఉమ్మడి జిల్లాలో 2.82 లక్షల (6-8శాతం) మంది ఉండగా, కమ్మ సామాజికవర్గం 91 వేలు, వెలమ, బ్రహ్మణ, కర్ణం వంటి ఇతర కులాలు 1.56 లక్షల మంది ఉన్నారు.
నియోజకవర్గంలో ఏ కులం ప్రభావం..
నల్లగొండ నియోజకవర్గంలో ముదిరాజ్, యాదవ, ఎస్సీ మాదిగ కులాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మిర్యాలగూడలో రెడ్డి, మున్నూరు కాపుల ప్రాబల్యం అధికంగా ఉంది. నాగార్జునసాగర్‌లో ఎస్టీల్లో లంబాడి, ఎస్సీల్లో మాదిగ కులం ప్రభావితం చేస్తోంది. దేవరకొండలో ఎస్టీ లంబాడి కులానిదే హవా. నకిరేకల్‌లో మున్నూరు కాపు, గౌడ, ఎస్సీ కులస్తుల ప్రభావం అధికంగా ఉంది. మునుగోడులో మున్నూరు కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తుండగా, భువనగిరిలో మున్నూరు కాపు, యాదవ, రెడ్లు, ఆలేరులో గౌడ, మున్నూరుకాపు, ఎస్సీలు, తుంగతుర్తిలో ఎస్సీ మాదిగలు డామినేట్ చేస్తుండగా, బీసీల ప్రాబల్యం కూడా ఉంది. సూర్యాపేటలో ముదిరాజ్, యాదవ, రెడ్డి, కోదాడలో రెడ్డి, బీసీలు, హుజూర్‌నగర్‌లో రెడ్డి, మున్నూరు కాపు సామాజికవర్గాల ప్రాబల్యం అధికంగా ఉంది.
నేతన్నలది రెండు లక్షల జనాభా…
ఉమ్మడి జిల్లాలో పద్మశాలి (చేనేత కార్మికులు) జనాభా 1.2 లక్షల నుంచి రెండు లక్షల మధ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో మూడు నుంచి 5 శాతం మంది ఉన్నారు. యాదాద్రి జిల్లాలో పోచంపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో పద్మశాలీలు విస్తరించి ఉన్నారు.
పద్మశాలీల జనాభా జిల్లాల వారీగా …
| జిల్లా | జనాభా పరిధి |
| నల్లగొండ | 60,000 – 80,000 |
| యాదాద్రి | 30,000 – 50,000 |
| సూర్యాపేట | 40,000 – 60,000 |
నల్లగొండ జిల్లా BC ప్రధాన ఉపకులాలు
| కులం | % | జనాభా |
| ముదిరాజ్ | 12% | 2,10,000 |
| మున్నూరు కాపు | 6.5% | 1,14,000 |
| యాదవ్ | 6.5% | 1,14,000 |
| గౌడ్ | 5.5% | 96,000 |
| షేక్ | 8.5% | 1,49,000 |
SC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| మాదిగ | 13% | 2,27,000 |
| మాల | 7% | 1,22,000 |
ST ఉపకులాలు
| కులం | % | జనాభా |
| లంబాడి | 11% | 1,92,000 |
| ఇతరులు | 3% | 52,000 |
OC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| రెడ్డి | 7.5% | 1,31,000 |
| కమ్మ | 2.5% | 43,000 |
| ఇతరులు | 4% | 70,000 |
యాదాద్రి భువనగిరి
| కులం | % | జనాభా |
| మున్నూరు కాపు | 11% | 1,07,000 |
| ముదిరాజ్ | 10% | 97,000 |
| యాదవ్ | 7.5% | 73,000 |
| గౌడ్ | 6.5% | 63,000 |
| షేక్ | 6.5% | 63,000 |
SC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| మాదిగ | 12.5% | 1,21,000 |
| మాల | 7% | 68,000 |
ST ఉపకులాలు
| కులం | % | జనాభా |
| లంబాడి | 6.5% | 63,000 |
| ఇతరులు | 1.5% | 15,000 |
OC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| రెడ్డి | 6.5% | 63,000 |
| కమ్మ | 2% | 19,000 |
| ఇతరులు | 4% | 39,000 |
సూర్యాపేట జిల్లా
BC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| ముదిరాజ్ | 11.5% | 1,34,000 |
| మున్నూరు కాపు | 9.5% | 1,11,000 |
| యాదవ్ | 7.5% | 88,000 |
| గౌడ్ | 6.5% | 76,000 |
| షేక్ | 6.5% | 76,000 |
SC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| మాదిగ | 13.5% | 1,58,000 |
| మాల | 7% | 82,000 |
ST ఉపకులాలు
| కులం | % | జనాభా |
| లంబాడి | 10.5% | 1,23,000 |
| ఇతరులు | 2.5% | 29,000 |
OC ఉపకులాలు
| కులం | % | జనాభా |
| రెడ్డి | 7.5% | 88,000 |
| కమ్మ | 2.5% | 29,000 |
| ఇతరులు | 4% | 47,000 |
ఉమ్మడి జిల్లా – అన్ని ప్రధాన కులాలు
| కులం | వర్గం | % | జనాభా |
| ముదిరాజ్ | BC | 11–13% | 4.5 లక్షలు |
| మున్నూరు కాపు | BC | 9–11% | 3.8 లక్షలు |
| మాదిగ | SC | 12–14% | 5.0 లక్షలు |
| లంబాడి | ST | 10–12% | 4.2 లక్షలు |
| యాదవ్ | BC | 6–8% | 2.8 లక్షలు |
| షేక్ | BC-E | 6–8% | 2.8 లక్షలు |
| గౌడ్ | BC | 5–7% | 2.3 లక్షలు |
| మాల | SC | 6–8% | 2.5 లక్షలు |
| రెడ్డి | OC | 6–8% | 2.8 లక్షలు |
| రజక | BC | 3–5% | 1.5 లక్షలు |
మధ్యస్థ BC కులాలు
| కులం | శాతం (%) | జనాభా |
| రాజక (చాకలి) | 3–5% | 1.2 – 1.8 లక్షలు |
| వడ్రంగి | 2–3% | 80,000 – 1.2 లక్షలు |
| కంసాలి | 2% | 70,000 – 80,000 |
| నాయీ బ్రాహ్మణ | 1–2% | 40,000 – 70,000 |
చిన్న BC కులాలు
| కులం | శాతం (%) | జనాభా |
| గంగపుత్ర / మత్స్యకారులు | 1–2% | 40,000 – 70,000 |
| బోయ / వాల్మీకి | 1–2% | 40,000 – 70,000 |
| దూదేకుల | 1–2% | 40,000 – 70,000 |
| ఇతర BCలు | 5–8% | 2 – 3 లక్షలు |