బీఆర్ఎస్, జమిలి ఎన్నికల పై మండలి చైర్మన్ గుత్తా సంచలన కామెంట్స్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించడమే మంచిదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నల్లగొండలో చిట్ చాట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తొలి విడత దేశంలో 18 రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని, దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంటదని చెప్పారు. 2034లో రెండో విడత దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణ పూర్తివుతుందని, ఈ ఎన్నికలు పూర్తియిన ఐదారు నెలల్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం ఎన్నికల తంతు అంతా ఒకేసారి పూర్తివుతుందని, ఎన్నికల పేరుతో సమయం వృథా కాదని చెప్పారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకటేసారి జరిగాయని, ఆ పద్ధతిలోనే ఎన్నికలు జరిగితే సమస్యలు ఉండవని, కానీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల పరిస్థితులు మారిపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా జనాలు అభివృద్ధి చూసి ఓట్లు వేయడం లేదని, పైసలు పైసలే.. ఓట్లు ఓట్లే అన్నట్టు చూస్తున్నారని, ప్రజల్లో కూడా మార్పు తేవాల్సిన ఆవశ్యత ఉందన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా ఎందుకు మారిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

జిల్లాలో రైస్ మిల్లర్లతో చర్చలు జరిపామని, తాలు ఎక్కువగా వస్తుండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైన మూడు డిమాండ్లు నెరవేరిస్తే వడ్ల కొనేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారని అన్నారు. 2017 నుంచి మిల్లు ఆడిచినందుకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని, బాయిల్డ్, రారైస్ పర్సంటేజీలో మార్పులు చేయాలని, వడ్ల రవాణాలో జాప్యం చేయకుండా చర్యలు చేపట్టాలని మిల్లర్లు తమ డిమాండ్లు ముందుపెట్టారని చైర్మన్ గుత్తా తెలిపారు.

Share
Share