APB News Exclusive: 33 శాతం కోటా అమలైతే… మంత్రుల సీట్లు గల్లంతు?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మహిళలకు 33 శాతం కోటా అమలైతే ముందుగా ఉమ్మడి జిల్లా మంత్రుల నియోజకవర్గాలే గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలు, తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 14,78,325, మహిళలు 15,30,181 మంది ఉన్నారు. అంటే పురుషులతో పోలిస్తే మహిళలు 51,856 మంది అధికంగా ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ తో పోలిస్తే నల్లగొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దేవరకొండ మినహా మిగితా ఆరు నియోజకవర్గాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. ప్రధానంగా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహించే నల్లగొండ, హుజూర్నగర్, కోదాడలో మహిళలు ఉండటం రాజకీయంగా చర్చకు దారితీసింది.

12 నియోజకవర్గాల్లో 33 శాతం కోటా ప్రకారం లెక్కిస్తే నాలుగు స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి. దీంట్లో ఒకటి ఎస్సీ మహిళకు, మూడు జనరల్ మహిళలకు రిజర్వు చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కూడా పెంచితే అప్పుడు మహిళలకు అధనంగా ఇంకో స్థానం పెరుగుతుంది. నియోజకవర్గాలు పెంచకుండా 2008లో పునర్విభజన చేసినట్టుగా మార్పులు చేర్పులు చేసి, 33శాతం మహిళా కోటాను అమలు చేస్తే కచ్చితంగా నాలుగు అసెంబ్లీ సీట్లు ఉమెన్స్ కు కేటాయించాలి. రాష్ట్రం యూనిట్ గా మహిళల జనాభా అధికంగా ఉన్న స్థానాలను రిజర్వు చేస్తారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్సెస్ ఉన్నారు. అన్నింటికంటే అత్యధిక మహిళా జనాభా, ఓటర్లు  హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ సెగ్మెంట్లలో ఉండటం గమనార్హం.

ఉమ్మడి జిల్లాలో హుజూర్నగర్ లోనే మహిళా ఓటర్లు టాప్. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 8,218 మంది ఎక్సెస్ ఉన్నారు. రెండో స్థానంలో కోదాడలో 7,231, నల్లగొండలో 7,102 మంది ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో సూర్యాపేటలో 6,935, మిర్యాలగూడలో 5,178, నాగార్జునసాగర్లో 5,178 మంది అత్యధికంగా ఉన్నారు. అయితే మహిళల రిజర్వేషన్ గురించి నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన మహిళను నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీలో నిలబెడ్తానని ప్రకటించారు. జనరల్ మహిళకు రిజర్వు అయితే ప్రస్తుత మేయర్ బుర్రి చైతన్యా రెడ్డికి సైతం అవకాశం వస్తదనే సంగతిని కొట్టిపారేయలేమని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి సైతం అవకాశం కలిసొస్తే తన భార్య శ్వేతను పోటీలో దింపనున్నారు. హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ వ్యూహాత్మకంగా వ్యవహారిస్తూనే ఆయన పుట్టిపెరిగిన సొంత నియోజకవర్గం తుంగతుర్తి పైన కన్నేశారు. హుజూర్నగర్ మహిళ కు రిజర్వు అయిన పక్షంలో, తుంగతుర్తి జనరల్ కు మారితే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండొచ్చని ఆ ప్రాంత పార్టీ కేడర్ అభిప్రాయ పడుతోంది. ఇందులో భాగంగానే ఉత్తమ్ ఇప్పటి నుంచే తుంగతుర్తి కాంగ్రెస్ ను భుజానకెత్తుకున్నారు. ఆయన భార్య పద్మావతి స్థానాకి ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వు అయిన నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా జనరల్ కు మారే అవకాశం ఉంటది. రెండింట్లో ఒక సీటు కచ్చితంగా ఎస్సీ ఉమెన్స్ కు రిజర్వు చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, కానీ జిల్లాలో తాజా, మాజీ ఎమ్మెల్యేల భార్యలకు ఎస్సీ ఉమెన్స్ కోటాలో పోటీ చేసే ఛాన్స్ కోల్పోయారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్పారెడ్డి కాగా, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ భార్య గాదరి కమల నేత, కాంగ్రెస్ సీనియర్ నేత కొండేటి మల్లయ్య భార్య లక్ష్మీ మున్నూరుకాపు, వీళ్లకు ఎస్సీ మహిళా నియోజకవర్గాల్లో పోటీ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి జనరల్ మహిళలకు రిజర్వు చేసే స్థానాల్లో పోటీకి వస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో రెడ్ల ఆధిపత్యం కలిగిన జిల్లాలో ప్రస్తుతానికి ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో లక్ష్మీ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు.

ఎస్సీ మహిళల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిడ్డ మానస, డాక్టర్ చెరుకు సుధాకర్ భార్య చెరుకు లక్ష్మీ, కొండేటి మల్లయ్య బిడ్డ డాక్టర్ సౌమ్య శ్రీ, గొర్రెల ఫెడరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ భార్య డాక్టర్ రాజేశ్వరి మాదిగ రేసులో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎస్సీ తాజా, మాజీ ఎమ్మల్యేల భార్యలు, బిడ్డలు అందరూ సైద్ధాంతిక భావజాలంతో వైవాహిక జీవితంలో ఒక్కటైన వాళ్లే. వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ(PhD)లు చేసి డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ జీవితానికే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నా అవకాశం అందివస్తే ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

క్ర.స.నియోజకవర్గంమహిళా ఓటర్లు (ఎక్కువ)గమనిక
1నాగార్జునసాగర్5,178మహిళలు ఎక్కువ
2మిర్యాలగూడ5,178మహిళలు ఎక్కువ
3నల్లగొండ7,102మహిళలు ఎక్కువ
4మునుగోడు1,521మహిళలు ఎక్కువ
5మిర్యాలగూడ3,388మహిళలు ఎక్కువ
6హుజూర్నగర్8,218మహిళలు ఎక్కువ
7కోదాడ7,231మహిళలు ఎక్కువ
8సూర్యాపేట6,935మహిళలు ఎక్కువ
9తుంగతుర్తి2,329మహిళలు ఎక్కువ
10భువనగిరి3,193మహిళలు ఎక్కువ
11ఆలేరు2,011మహిళలు ఎక్కువ
12దేవరకొండ428పురుషులు ఎక్కువ
Share
Share