Good News: ఈ నెల 14న హుజూర్​నగర్​ కు సీఎం రేవంత్​

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మానస పుత్రికగా గుర్తింపు పొందిన రామస్వామిగుట్ట వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు ఈ నెల 14న సీఎం రేవంత్ రానున్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ బుధవారం హుజూర్నగర్ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఇళ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హుజూర్నగర్ సమీపంలోని రామస్వామి గుట్టలో 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలనీ నిర్మించారు. ఇందులో 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఆ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగిందని, 2 014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రా జెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరణ కు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చేశారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్కు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు. మొదటి దశలో కేవలం వెయ్యి మంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని, అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి, సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

Share
Share