సర్పంచ్ ఎన్నికలలో అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపే: డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత
నల్లగొండ, ఏపీబీ న్యూస్: అధికారం లేనప్పుడు మాత్రమే కృష్ణా జలాలు గుర్తుకు వస్తాయని, అధికారం కోల్పోయిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లకు అహంకారం తగ్గలేదని నల్లగొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత మండిపడ్డారు. బుధవారం నల్గొండ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన అవాకులు, చవాకులు, చూస్తే కాంగ్రెస్ నాయకులకు ఆవేశం వస్తుందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన ఇంకా సిగ్గు రాలేదని కేసీఆర్ ను ఫాంహౌజ్ కు పరిమితం చేసింది రేవంత్ రెడ్డి కాదా అని అన్నారు. కృష్ణ జలాలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు 299 టీఎంసీలకు సంతకం పెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ఎత్తు తగ్గించి తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్ అని అన్నారు. శ్రీశైల సొరంగం పనులు 10ఏళ్లలో తట్టెడు మట్టి అయినా తీశారా అని ప్రశ్నించారు. చర్లగూడెం, నెల్లికల్లు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని కిష్టరాంపల్లి ,ఉదయ సముద్రం గ్రామంలో ప్రాజెక్టును ఎందుకు కట్టలేదని అన్నారు. 8.30 లక్షల కోట్లు అప్పు చేసిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. నల్గొండ, ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలను శాశ్వతంగా ఎడారి చేయాలని కేసిఆర్ లో కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
జిల్లా మంత్రులైన ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో జిల్లా సశ్యామలం అవుతుందని అన్నారు. రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రైతులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసి సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు సర్పంచ్ ఎన్నికలలో 60 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని మొన్న జరిగిన, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం చూపి విజయాన్ని అందించారని అన్నారు. పార్టీలో నాయకత్వం కోసం కవిత, కేటీఆర్, హరీష్ రావులు తన్నుకుంటున్నది ప్రజలు చూస్తున్నారని అన్నారు. వీరి రాజకీయం చూస్తుంటే సురభి నాటకాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలోని ప్రాజెక్టులు కట్టబెట్టి కమిషన్లు తీసుకున్న ఘనత హరీష్ రావుకు ఉందని అన్నారు.
కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాకలు చూస్తే డ్రైనేజీ లో చెత్తలాగా ఉన్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై గాదరి కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని, బాల్క సుమన్, సంతోష రావులకు పదవులు వస్తే తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ సమస్య తీరుతుందా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తన్ని తరుముతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కన్నారావ్, ఎస్ఎస్సి జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, చింతమల్ల వెంకటయ్య, పుట్ట వెంకన్న గౌడ్, తిరుమలేష్ శివ గౌడ్, నరేష్, కర్నాటి మచ్చ గిరి, వేణు, సైదులు తదితరులు ఉన్నారు.
సురభి నాటకాల లాగా కేటీఆర్, హరీష్ రావు తీరు: డిసిసి ప్రెసిడెంట్