APB News Exclusive: రెడ్‌క్రాస్‌ నుంచి గోలి అవుట్‌.. హేమలత ఇన్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్గొండ రెడ్క్రాస్ ఎన్నికల్లో ఓటర్లు మార్పు వైపు మొగ్గుచూపారు. గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న గోలి అమరేందర్ రెడ్డి ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ హేమలత ప్యానెల్కు పట్టం కట్టారు. మొత్తం 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హేమలత ప్యానెల్ 8 స్థానాల్లో విజయం సాధించగా, మాజీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ 7 స్థానాలకే పరిమితమైంది. దీంతో రెడ్క్రాస్ పగ్గాలు హేమలత ప్యానెల్ చేతికి వెళ్లగా, నల్గొండ క్లబ్కు చెందిన గోలి వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది.

రెడ్క్రాస్లో ఇన్నాళ్లూ కొనసాగిన ఆధిపత్యానికి ఎన్నికల ఫలితాలు తెరదించాయి. రెండు ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హేమలత ప్యానెల్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ కూడా 7 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 8 స్థానాలతో హేమలత ప్యానెల్ పైచేయి సాధించడంతో రెడ్క్రాస్లో కొత్త నాయకత్వానికి అవకాశం ఏర్పడింది.

12 ఏళ్లుగా కొనసాగిన ఏకచక్రాధిపత్యానికి ఓటర్లు ముగింపు పలకడం, నల్గొండ క్లబ్కు రెడ్క్రాస్ పగ్గాలు దక్కకపోవడం ఈ ఎన్నికల్లో ప్రధాన పరిణామాలుగా నిలిచాయి. హేమలత ప్యానెల్ విజయం సంస్థలో నాయకత్వ మార్పునకు దారితీసింది.

Share
Share