నూతన సంవత్సరం… ప్రముఖుల శుభాకాంక్షలు..

నల్గొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా జిల్లా మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సమానత్వం అనే లక్ష్యాలతో మరింత వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

Share
Share