APB News Exclusive: ఈనెల 20 నుంచి ఎస్​ఎల్బీసీ(SLBC) ఇన్​లెట్​ పనులు.. డెడ్ లైన్ ఎప్పుడంటే?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: త్వరలో శ్రీశైలం సొరంగ మార్గం ఇన్లెట్ పనులు మొదలు కానున్నాయి. మార్చి 20 నుంచి ఇన్లెట్ పనులు షురూ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇన్లెట్, అవుట్ లెట్ పనులు వేగవంతం చేయడం ద్వారా రోజుకు 14 మీటర్ల చొప్పున సొరంగం తవ్వకం పనులు చేపట్టాలని, తద్వార 2028 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇప్పటికే టన్నెల్ అవుట్ లెట్ (నాగర్ కర్నూలు జిల్లా మన్నె వారిపల్లి) వద్ద పనులు మొదలుకాగా, 50 మీటర్ల వరకు పూర్తిచేసిన పనులు సక్సెస్ అయ్యాయి. అదే ధీమాతో ఇన్లెట్ (శ్రీశైలం రిజర్వాయర్ బాక్ వాటర్ దోమలపెంట) వద్ద ఉగాది తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 24 గంటల పాటు రేయింబవళ్లు కంటిన్యూగా పనులు చేసేందుకు ప్రత్యేక అధికారుల నియామకం కూడా పూర్తియ్యింది. ఇన్లెట్ వద్ద ఒక డెప్యూటీ డీఈ, అవుట్ లెట్ వద్ద మరొక డీఈ, ఒక్కొ డీఈ పరిధిలో నలుగురు ఏఈ లు షిఫ్ట్ల పద్ధతిలో వర్క్స్ మానిటరింగ్ చేస్తారు.

టన్నెల్ బోరింగ్ మిషన్కు బయటకు తీసేశారు. కొత్త టెక్నాలజీ డ్రిల్లింగ్, బ్లాసింగ్ మోడ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉపయోగిస్తున్నారు. బ్లాస్టింగ్ మోడ్లో సర్ఫేస్కు డ్రిల్లింగ్ చేస్తారు, డ్రిల్లింగ్ జరిగిన ప్రదేశాల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ (ఎక్స్ప్లోజివ్స్) ఫిల్ చేస్తారు. సొరంగం లో రాతి కండీషన్ బట్టి పేలుడు పదార్ధాలను ప్రయోగిస్తారు. దాంతో రాక్ చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి కింద పడిపోతుంది. జేసీబీ(JCB) ల సాయంతో పడిపోయిన రాతి ముక్కలను బయటకు తరలిస్తారు. అయితే టీబీఎం(TBM)తో పోలిస్తే డీబీఎం(DBM) మోడ్లో వర్కర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి రోజు పనులను పర్యవేక్షిస్తున్నారు.

గతేడాది ఫిబ్రవరిలో ఇన్లెట్ పైకప్పు కూలిన ఘటనలో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ఇన్లెట్ ఏరియాలో వాటర్ సీపేజీ ఎక్కువగా ఉన్నందున అలైన్మెంట్ చేంజ్ చేశారు. పనుల డైవర్షన్కు ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చిందని తెలిసింది. దీంతోనే 20 నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే.. ప్రభుత్వం  ఎన్ఏటీఎం(NATM) అనే అడ్వాన్స్డ్ టన్నెలింగ్పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా టన్నెల్ను బ్లాస్ట్ చేయగానే ఆ ప్రాంతం మరింత వీక్ కాకుండా.. కిందికి పడిపోకుండా ‘షాట్క్రీటింగ్’ ద్వారా కాంక్రీట్ మిక్చర్తో అక్కడ ప్లాస్టింగ్ చేస్తారు. బ్లాస్ట్ చేసినప్పుడు అక్కడ రాతి డీఫార్మేషన్నూ క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఒక వేళ అక్కడ బలహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తే అదనపు రక్షణ చర్యలను తీసుకుంటారు. ఇక, ప్లాస్టింగ్ చేశాక దానిపై రాక్బోల్ట్స్ లేదా వైర్ మెష్ లేదా స్టీల్ రిబ్స్ వంటి వాటితో టన్నెల్ను పటిష్ఠం చేస్తారు. బ్లాస్టింగ్ చేసినప్పుడు వ్యర్థాలు కింద భారీ వేగంతో పడిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో గ్రౌండ్ బలహీనపడకుండా చూసుకుంటూ అవసరమైన చోట కాంక్రీట్తో రీఇన్ఫోర్స్ చేస్తారని అధికారులు చెప్పారు.

ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ మొత్తం 43.954 కిలోమీటర్లు. అందుల్లో ఔట్ లెట్ వైపు నుంచి 20.435 కి.మీలు, కాగా, ఇన్లెట్ నుంచి 13.95 4 కి.మీలు పనులు జరిగాయి. ఇంకా 9.54 కి.మీ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. టన్నెల్ పై కప్పు కూలిపోవడంతో షియర్ జోన్లు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్తో హెలిబార్న్ సర్వే చేయించింది. ఆ సర్వే తగ్గట్టుగా డీబీఎం మోడ్లో పనులు చేయాలని నిర్ణయించారు. రాక్బోల్ట్ హోల్ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్దతిలో టన్నెల్ తవ్వాలని, ఆర్సిసీ (కాంక్రీట్)కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. టన్నెల్లో ఉన్న నీళ్లను తోడేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిమిషానికి 4,381 లీటర్ల నీటిని తోడుతుండగా, టీబీఎం కూలిన చోట నిమిషానికి మరో 1486 లీటర్ల నీటిని తోడుతున్నారు. రైలు లైన్ పనులు ముమ్మరం చేస్తున్నారు. టన్నెల్ ఔట్లెట్ వద్ద ఇప్పటికే టీబీఎం తొలగించారు. డ్రిల్లింగ్ కోసం బూమర్ యంత్రాలు, కాంక్రీట్ లైనింగ్ కాస్టింగ్ కోసం సీఫా షాట్ క్రీట్, వెట్షాట్ క్రీట్, సెల్ఫ్ లోడింగ్ మిక్సర్, ఎయిర్ కూల్డ్ లోకో ఇంజన్, ఫ్లాట్ ఫాం యాక్సిల్, ఎలక్రిక్ కంప్రెషర్ లాంటి యంత్రాలను వినియోగిస్తున్నారు.

Share
Share