- అనైక్యత వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
- 70 శాతం గ్రామాల్లో గెలిచినం..ఓడిన చోట గుణపాఠం నేర్చుకోవాలి
- అభివృద్ధి కంటే…పైసలు పంచిపెట్టడం పైనే చర్చ
- కొత్త సర్పంచ్లు దాదాగిరి చేయోద్దు..గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
- గెలిచిన గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు నజరానా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇరిగేషన్ మినిస్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్లో కొత్త సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి, పోటీ చేయడం వల్ల కొన్ని గ్రామాల్లో ఓడిపోవాల్సి వచ్చిందని, మెజార్టీ పంచాయతీలు గెలుపొందినప్పటికీ, పార్టీ కేడర్ సమిష్టిగా లేకపోవడంతో పలు గ్రామాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుణపాఠంగా భావించాలని, ఎన్నికల్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఎన్ని పైసలు పంచిపెట్టామనే దాని పైనే ఎక్కువ చర్చించడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఓడిపోయిన గ్రామాల పైన దృష్టి పెట్టాలని, అక్కడ అభివృద్ధి పైన మరింత లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, ఇప్పటి వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోయానని, రాజకీయాలు మన ప్రాంతంలో, రాష్ట్రంలో చాలా కమర్షియల్గా మారాయని దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. కొత్తగా గెలిచిన సర్పంచ్లు గ్రామాల్లో దాదాగిరీ చేయోద్దని, ప్రజలతో మమేకం కావాలని మంత్రి హితవు పలికారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తాను బిజీగా ఉన్నందున గ్రామ ప్రథమ పౌరులుగా సర్పంచ్లు అభివృద్ధి పైన, పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల గ్రామాలకు తక్షణమే ఊరికి 25, 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. మలి విడత మార్చిలో మరికొంత మందికి శాంక్షన్ చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కొన్ని గ్రామాల్లో అనైక్యత వల్లే ఓడిపోయాం: మంత్రి ఉత్తమ్