Sarpanch Elections: మంత్రి ఉత్తమ్​ @ సెంచరీ

  • సూర్యాపేట జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న హుజూర్​నగర్​ నియోజకవర్గం
  • ఏకగ్రీవంతో కలిపి వందకు పైగా  పంచాయతీల్లో కాంగ్రెస్​ సపోర్టర్స్​ హవా
  • దేవరకొండలో కాంగ్రెస్​కు ధీటుగా బీఆర్​ఎస్​, ఇండిపెండెంట్లు
  • మూడు సెగ్మెంట్లలో మిగిలిన మండలాల్లో గట్టెక్కిన హస్తం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: సూర్యాపేట జిల్లాలో మంత్రి నలమాద ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సెంచరీ దాటారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రకటించిన ఫలితా ల్లో హుజూర్​నగర్​ సెగ్మెంట్​లో కాంగ్రెస్​ మద్ధతుదారులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడతో పోలిస్తే అత్యధికంగా హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ సపోర్టర్స్​ గెలుపొందడం విశేషం. ఈ నియోజకవర్గంలో మొత్తం 146 జీపీల్లో 22 ఏకగ్రీవం కాగా, 124 పంచాయతీల్లో 769 మంది పోటీలో ఉన్నారు. సగటున ఒక్కో గ్రామంలో ఐదారుగురు నిలబడ్డారు. సొంత పార్టీలో రెబల్స్​ ప్రభావం ఫలితాల పైన పడకుండా మంత్రి ఉత్తమ్​ చాకచక్యంగా వ్యవహారించారు. పోలింగ్​కు నాలుగైదు రోజుల ముందు నుంచే హుజూర్​నగర్​లో మకాం పెట్టి అసంతృప్తులతో నేరుగా చర్చలు జరిపారు. దీంతో మెత్తబడ్డ రెబల్స్​ పార్టీ క్యాండేట్లకు అండగా నిలబడ్డారు. దీంతో 124 పంచాయతీల్లో బుధవారం రాత్రి 10 గం టల వరకు 80 చోట్ల కాంగ్రెస్​ మద్ధతుదారులు గెలుపొందారు. బీఆ ర్​ఎస్​ 28, స్వంతంత్రులు 7గురు గెలిచారు. మిగితా స్థానాల్లో సైతం కాంగ్రెస్​ సపోర్టర్స్​ లీడ్​లో ఉన్నట్టు తెలిసింది.

దేవరకొండలో కాంగ్రెస్ మద్ధతుదారులకు స్వతంత్రులు, బీఆర్​ఎస్​ క్యాండేట్లు గట్టి ఝలక్ ఇచ్చారు. 269 పంచాయతీలకు 33 ఏకగ్రీ వం కాగా, 236 పంచాయతీల్లో ఫలితాలు ప్రకటించే సమయానికి 126 కాంగ్రెస్​, 57 బీఆర్​ఎస్​, 32 మంది ఇండిపెండెంట్లు, ఒక బీజే పీ క్యాండేట్​ గెలుపొందారు. కాంగ్రెస్​కు వ్యతిరేకంగా స్వతంత్రులు నిలబడిన గ్రామాల్లో ఓటర్లు వాళ్ల వైపే మొగ్గుచూపారు. దీంతో ఫలితాలు తారుమారయ్యాయి. ఇక మూడో విడతలో పట్టుసాధించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి తీవ్రంగానే శ్రమించారు. నారాయాణ్​పూర్​, చౌటుప్పుల్​ మండలాల్లో కాంగ్రెస్​ మద్ధ తుదారులు గట్టెక్కారు. ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గంలో మిగిలిన మోటకొండూరు, అడ్డగూడూరు, గుండాల, మోత్కూరు మండలాల్లో కాంగ్రెస్​ మద్ధతుదారులు గెలుపొందారు. పలు గ్రామాల్లో బీఆర్​ఎస్​ క్యాండేట్లు సత్తా చాటారు.

మూడో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో సమ స్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఉదయం 7గంట ల నుంచే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు. దాంతో 9గంటల వరకే పోలింగ్​ 30 శాతానికి చేరింది. ఆ తర్వాత 11 గంటల వరకు పోలింగ్​ 60 శాతానికి చేరుకుంది. దీంతో అధికారులు, ఎన్నికల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవరకొండ డివిజన్​లో మొత్తం ఓటర్లు 2, 57, 135 మంది కాగా, 2,28,135 మంది ఓటు హక్కు వినియో గించుకున్నారు. పోలింగ్​ 87.59 శాతం నమోదైంది. పురుషులు 1,28,622 మందికిగాను 1,14,310 (88.87శాతం), మహిళలు 1,28,493మందికిగాను 1,13,816 మంది (88.58)ఓటు వేశారు. ఇతరులు 20 మందిలో 9 మంది (45శాతం) ఓటు వేశారు. సూ ర్యాపేట జిల్లాలో 1,92,617 మంది ఓటర్లకుగాను 1,71,903 మంది (89.25శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 93,658 మందికిగాను 83,390 (89.04), మహిళలు 98,952 మందికిగాను 88,507 (89.44శాతం), ఇతరులు ఏడుగురులో ఆరుగురు (85.71)శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి జిల్లాలో ఓటర్లు 1,59,289 మందిలో 1,47,432 మం ది (92.56)శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 79,364 మందిలో 73,640 (92.79), మహిళలు 79,925 మందికి గాను 73,792 (92.33శాతం) మంది ఓటు హ క్కు వినియోగించుకున్నారు.

జిల్లాపేరు9గంటలకు11గంటలకు1గంటకు
నల్లగొండ29.0657.8987.59
సూర్యాపేట24.8360.1386.19
యాదాద్రి23.6256.5985.94
Share
Share