పల్లెల్లో కాంగ్రెస్​ జోష్​..989 చోట్ల హస్తం పార్టీ హవా…465 చోట్ల BRS

  • 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ గట్టి పోటీ …
  • మిగిలిన మూడు నియోజకవర్గాల్లో తిరుగులేని హస్తం
  • కాంగ్రెస్కు దీటుగా 61 నుంచి 30 స్థానాలు
  • 180 పంచాయతీల్లో సత్తా చాటిన రెబల్స్, ఇండిపెండెంట్లు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కేడర్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు సత్తా చాటారు.ప్రత్యర్ధి బీఆర్ఎస్ శ్రేణుల ఎత్తులకు చెక్ పెట్టారు. ఎమ్మెల్యేలు పార్టీ మద్ధతు దారులను గెలిపించడంలో సర్వశక్తులు ఒడ్డారు. బీఆర్ఎస్ మాజీ లు గట్టిగా పనిచేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్ మద్ధతుదారులు ఒంటిరిగానే ఫైట్ చేశారు. బీఆర్ఎస్కు మాత్రం పరోక్షంగా కమ్యూనిస్టులు, బీజేపీ మద్ధతు తెలిపింది. రెబల్స్కు, స్వంత్రులకు సైతం బీఆర్ఎస్ పరోక్షంగా సహరించింది. దాంతో ఈ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో స్వంత్రులు, రెబల్స్ సత్తా చాటారు. 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపిన చోటే రెబల్స్, ఇండిపెండెంట్లు గెలవడం గమనార్హం. 

12 నియోజకవర్గాల్లో 1820 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు 989 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ 465 మంది గెలుపొందగా, స్వతంత్రులు, రెబల్స్ 180 మంది గెలిచారు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే నల్లగొండ, హుజూర్నగర్, కోదాడలో బీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. దాంతోనే ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. పంచాయతీల సంఖ్య అత్యధికంగా ఉన్న సెగ్మెం ట్లలో రెండు పార్టీల మధ్య పోటీ జరిగింది. రెబల్స్ కూడా గట్టిపోటీ ఇ చ్చారు. దాంతో ఆలేరు, భువనగిరి, మునుగోడు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్లో బీఆర్ఎస్తో పాటు, రెబల్స్ ప్రభావం చూపారు. ఈ స్థానాల్లోనే బీజేపీ, కమ్యూనిస్టులు సైతం బీఆర్ఎస్తో కలిసి పనిచేశారు.

జిల్లాపేరుజీపీలుకాంగ్రెస్బీఆర్ఎస్ఇతరులు
నల్లగొండ8864261
మునుగోడు161873721
నకిరేకల్126773110
మిర్యాలగూడ134723614
నాగార్జునసాగర్186843234
దేవరకొండ2691465425
సూర్యాపేట116643611
కోదాడ12058238
ఆలేరు1931116111
మొత్తం1820989465180

నోట్: ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, రెబల్స్తో కలిపి ఇతరులు.

Share
Share