హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: త్వరలోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వస్తారని, గవర్నర్ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మట్టపల్లి లో గవర్నర్ రాక ఏర్పాట్ల పై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

మట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రోడ్లు, కాలువలు, నది పరివాహక ప్రాంతం పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలని, రోడ్ల పై ఎక్కడైనా గుంతలు లేకుండా వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అవసరమైన చోట అప్రోచ్ రోడ్లు నిర్మించాలని, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉండడమే కాకుండా, అత్యవసర మందులు, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ హెలి ప్యాడ్, పార్కింగ్, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు.