రామస్వామి గుట్ట వద్ద ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్​ తేజస్​ నంద్​ లాల్​ పవార్​

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం హుజూర్నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల బ్లాక్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఇంత భారీ ఎత్తున, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతతో నిర్మించాలని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేసి   ప్రారంభించుటకు సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు.

Share
Share