హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున సుప్రీంకోర్టు లో వాదనలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
