- నా సొంతానికి రోడ్డు వేయట్లే
- ఒకరిద్దరు పనిలేని వాళ్లతోనే చిక్కులు
- మీడియాకు మరోసారి మంత్రి కోమటిరెడ్డి క్లాస్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ మీడియా పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఇళ్ల జాగల కోసం ప్రశ్నించిన ఓ జ ర్నలిస్టు పైన మండిపడ్డ మంత్రి.. తాజా మరోసారి సంచలన వ్యాఖ్య లు చేశారు. నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి నా ఒక్కరి కోసం కాదని కేంద్ర ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల నిధులు తెచ్చి నల్లగొండను దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాని మంత్రి చెప్పారు, కానీ మీడియాలో ఒకరిద్దరు పనిలేని వాళ్లు ఏదైనా రోడ్డు వేయగానే దాని మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలోనే నల్లగొండను మోడల నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని స్పష్టం చేశారు.
https://www.instagram.com/reel/DWWRQVqkTr1/?igsh=MXZmMXhqc3cyZnNoOA==
నల్లగొండ అభివృద్ధిని మీడియా అడ్డుకోవద్దని, సహరించాలని కోరారు. నా సొంతానికి రోడ్డు వేయడం లేదని, ఢిల్లీ నుంచి వెయ్యి కోట్లు తెచ్చి నల్లగొండను డెవలప్ చేస్తున్నానని తెలిపారు. గతంలో కూడా నల్లగొండ బైపాస్ రోడ్డు పైన మీడియాలో వచ్చిన కథనాల పైన మంత్రి తీవ్రంగానే స్పందించారు. జరుగుతున్న అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు ప్రచారం చేస్తే కాంట్రాక్టర్లు పనులు వదిలిపెట్టే వెళ్లిపోయే పరిస్థితి వస్తదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టరే పనిచేస్తుండని గతంలో మంత్రి చెప్పిన సంగతి తెలిసిందే.
Breaking News: మీడియా పైన … మంత్రి కోమటిరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్