- 17 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్లో ముగిసిన ఎన్నికలు
- యాదాద్రి జిల్లాలో పోలింగ్ టాప్, సెకండ్ సూర్యాపేట
- మొత్తం ఓటర్లు 6.58 లక్షలు, ఓటేసేనోళ్లు 5.29 లక్షలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు, నల్లగొండ కార్పోరేషన్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, చిట్యాల, చండూరు, తిరుమలగిరి, సూర్యాపేట, మోత్కూరు మున్సిపాలిటీల్లో చెదురు మదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 6,58,156 మంది ఉండగా, 5,29,671 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 400 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా పోలింగ్ యాదాద్రి జిల్లాలో 87.1శాతం నమోదు కాగా, రెండో ప్లేస్లో సూర్యాపేటలో 79.90శాతం, నల్లగొండ జిల్లాలో 78.09 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ 10 గంటల వరకు మందకొడిగానే సాగింది. ఆ తర్వాత నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం మొదలు పెట్టారు. మధ్యాహ్నాం తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు
నల్లగొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో పురుషులు 1,49,399 మంది ఓటర్లు ఉండగా, 1,16,296 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు 1,158,518 మంది ఉండగా, 1,24,163, ఇతరులు 75 మందికిగాను 55 మంది ఓటు వేశారు.
సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో పురుషులు 1,05,558 మంది ఉండగా, 85,694, మహిళలు 1,14,380 మందికిగాను 90,039, ఇతరులు 34 మందికిగాను 26 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
యాదాద్రి జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో పురుషులు 63,647 మందికి గాను 55,641, మహిళలు 66,527 మందికిగాను 57,741, ఇతరులు 18 మందికిగాను 16 మంది ఓటు వేశారు.
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ వివరాలు
నల్లగొండ జిల్లా:
| మున్సిపాలిటీ | మొత్తం ఓటర్లు | పోలైన ఓట్లు | పోలింగ్ శాతం (%) |
| నల్లగొండ (కార్పొరేషన్) | 1,42,437 | 1,10,194 | 77.36% |
| మిర్యాలగూడ | 93,020 | 72,036 | 77.44% |
| దేవరకొండ | 23,830 | 19,127 | 80.26% |
| నందికొండ | 13,521 | 8,069 | 59.60% |
| హాలియా | 11,696 | 10,033 | 85.78% |
| చిట్యాల | 12,118 | 10,649 | 87.88% |
| చండూరు | 11,370 | 10,406 | 91.52% |
సూర్యాపేట జిల్లా:
| మున్సిపాలిటీ | మొత్తం ఓటర్లు | పోలైన ఓట్లు | పోలింగ్ శాతం (%) |
| హుజూర్నగర్ | 28,867 | 23,926 | 82.88% |
| కోదాడ | 53,056 | 40,881 | 77.05% |
| నేరేడుచర్ల | 13,746 | 10,893 | 79.24% |
| సూర్యాపేట | 1,08,848 | 86,403 | 79.38% |
| తిరుమలగిరి | 15,455 | 13,656 | 88.36% |
యాదాద్రి జిల్లా:
| మున్సిపాలిటీ | మొత్తం ఓటర్లు | పోలైన ఓట్లు | పోలింగ్ శాతం (%) |
| ఆలేరు | 13,632 | 11,692 | 85.81% |
| భువనగిరి | 47,831 | 39,664 | 82.93% |
| చౌటుప్పల్ | 25,801 | 23,713 | 91.91% |
| మోత్కూరు | 14,383 | 12,502 | 86.92% |
| పోచంపల్లి | 15,827 | 14,394 | 90.95% |
| యాదగిరిగుట్ట | 12,718 | 11,428 | 89.86% |