- మిర్యాలగూడెంలో ఊపందుకున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
- ప్రభుత్వ బాకీ కార్డుతో ఇంటింటికి తిరుగుతున్న క్యాండేట్లు
- ఏపీబీ మలివిడత సర్వేలో ఆసక్తికలిగించే అంశాలు
- మలివిడత సర్వేలో బీఆర్ఎస్ కు 11.18 శాతానికి చేరిన ప్రజామోదం
- కాంగ్రెస్ 30.99 శాతం, బీఆర్ఎస్ 42.17 శాతం మంది మొగ్గు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోష్ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని కైసవం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, ఆయన కొడుకు సిద్ధార్ధ పార్టీ కేడర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. అధికార పార్టీకి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఆ మేరకు ఎన్నికల ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. పార్టీ హైకమాండ్ రూపొందించిన బాకీ కా ర్డుతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తున్నారు. దాంతో అతి తక్కువ సమయంలోనే పట్టణ ప్రజల్లో అనూహ్యమైన మార్పు కోరుకుంటున్నట్టు ఏపీబీ సర్వేలో తేలింది. జనవరి 30 ప్రకటించిన మొదటి విడత సర్వేలో 15,810 శాంపిల్స్‌లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్కు 8.29 శాతం మంది మొగ్గు చూపారు. ఈ సర్వేల్లో బీఆర్ఎస్కు 44.55శాతం మంది మద్ధతు తెలుపగా, కాంగ్రెస్ కు 35.86శాతం మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కాగా మలివిడత సర్వేలో కాంగ్రెస్ మరింత వెనకబడినట్టు సర్వే ఫలితాల్లో తేలింది.
11.18 శాతం పెరిగిన మద్ధతు
బీఆర్ఎస్కు పట్టణ ఓటర్ల మద్ధతు పెరుగుతోందని తాజా సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం 1,30,000వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేయగా, కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్కు 11.18 శాతం మంది ప్రజలు తమ మద్ధతు తెలిపారు. ప్రధానంగా ఫించన్లు, తులం బంగారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాల పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ క్యాండేట్లు ఇంటింటికి తిరిగి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి, ఈ రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన పనుల గురించి వివరిస్తున్నారు. మహిళలు, యువకులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు సకాలంలో బెనిఫిట్స్ చెల్లించకుండా, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రిలీజ్ చేస్తున్నారని, దీనివల్ల కుటుంబ సమస్యలు తీర్చుకోలేకపోతున్నామని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
కాక రేపుతున్న సిద్ధార్థ హాట్ కామెంట్స్
మున్సిపాలిటీని కాంగ్రెస్ వశం చేస్తే, మరో పల్నాడుగా మారుతుందని సిద్ధార్ధ చేసిన హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వైఖరిని ఎన్నికల ప్రచారంలో ఎండగడుతున్నారు. దీంతో పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. గ్రూపు తగాదాలతో కాంగ్రెస్ అతలా కుతలమైందని, ఇదే రకమైన వైఖరితో మున్సిపాలిటీలో పాలన సాగిస్తే ప్రజల సమస్యలు గాలికి వదిలేసినట్టేనని సిద్ధార్ధ చేస్తున్న వ్యా ఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
తాజా సర్వే గణాంకాలు ఇలా
| Party | Vote % |
| బీజేపీ | 16.55% |
| బీఆర్ఎస్ | 42.17% |
| కాంగ్రెస్ | 30.99% |
| ఇతరులు | 10.29% |