- 48 డివిజన్లలో అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న
- మంత్రి కోమటిరెడ్డి సహకారంతో భారీగా నిధులు తెస్తాం
- ఇప్పటికే పట్టణంలో రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు
- 24 గంటల నిరంతర నీటి సరఫరాకు కట్టుబడి ఉన్నాం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు కృషి
- ఏపీబీ ప్రతినిధితో మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్గొండ కార్పోరేషన్ తొలి మహిళా మేయర్‌గా పోటీచేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పైన ఉన్న నమ్మకంతో పెద్ద బాధ్యత అప్పగించారు. గత ఐదేళ్లలో కౌన్సిలర్‌గా నావార్డు ప్రజల విశ్వాసం పొందాను. నా భర్త ప్రోదల్బంతో గత ఎన్నికల్లో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన నాకు మళ్లీ మేయర్‌గా పోటీ చేస్తానని ఊహించలేదు. ఈ ఎన్నికల్లో 48 డివిజన్లలో మంత్రి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి చరిత్ర సృష్టిస్తాం. నల్లగొండను మెగా స్మార్ట్ సిటీగా మారుస్తాం. అని మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమె ఏపీబీ ప్రతినిధితో మాట్లాడారు.

నా భర్త అడుగు జాడల్లోనే
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతోనే నా భర్త శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించారు. సాధారణ గృహిణిగా ఉన్న నేను గత ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. 32 వార్డు ప్రజలు కౌన్సిలర్‌గా ఆదరించారు. ఆ ఎన్నికల్లో నన్ను, నా భర్తను గెలిపించి ప్రజలు మా పైన బాధ్యత పెంచారు. కౌన్సిలర్‌గా గెలుపు తో ప్రజలకు మరింత దగ్గరయ్యాను. నా భర్త ఫ్లోర్ లీడర్‌గా, వైస్ చైర్మన్, చైర్మన్‌గా పట్టణ ప్రజలకు సేవలందించారు. అదేబాటలో మేయర్‌గా మరోసారి ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కింది. గత ఎన్నికల్లో నాభర్త శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ అవకాశం చేజారిపోయింది. 20 వార్డుల్లో అభ్యర్థులు గెలిచి మంత్రి కోమటిరెడ్డికి అండగా నిలబడ్డారు.
రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు
నల్లగొండలో రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి నల్లగొండను మెగా స్మార్ట్ సిటీగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీ సీ రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పట్టణ ప్రజలకు 24 గంటల పాటు కృష్ణా జలాలు అందించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద 11 ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రయోగం సక్సెస్ కాగానే పట్టణం అంతా అమలు చేస్తాం. అమృత్ స్కీంతోనే పట్టణ వాసుల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.150 కోట్లతో లతీఫ్ సాహెబ్ గుట్టకు ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
మెగాస్మార్ట్ సిటీగా మారుస్తాం
పదేళ్ల విరామం తర్వాత కార్పోరేషన్ రూపంలో నల్లగొండను అభివృద్ధి చేసుకునే అవకాశం పట్టణ ప్రజలకు దక్కింది. పట్టణంలో ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా ఒకప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు చేసిందే. దేశంలోనే మొదటిసారిగా నల్లగొండ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. మళ్లీ అప్పటి నుంచి గత పదేళ్ల పాటు పట్టణంలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. ఈ రెండేళ్లలోనే అండర్ గ్రౌండ్ పనులు, తాగునీటి వసతుల పైన దృష్టి పెట్టాం. మేయర్‌గా గెలిపిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయి. నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు లభిస్తుంది. కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డికి ఉన్నసపోర్ట్ పట్టణాభివృద్ధికి మరింత కలిసొస్తది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న నల్లగొండను మెగా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రజలు తప్పక ఆదరిస్తానే నమ్మకం మాకు ఉంది.