Breaking News: మిర్యాలగూడలో టగ్​ ఆఫ్​ వార్​! ఏపీబీ సర్వే సంచలన రిపోర్ట్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడలో మున్సిపాలిటీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పట్టణ ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు తగాదాలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఏపీబీ న్యూస్ తాజాగా నిర్వహించిన సర్వేలో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. 48 వార్డుల్లో 15,810 శాంపిల్స్ సేకరించగా, అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేతకను వెలిబుచ్చారు. 48 వార్డుల్లో ప్రధానంగా మహిళలు, వృద్ధులు, యువకులు, ఉద్యోగులు, నిరుద్యోగుల నుంచి ఏపీబీ న్యూస్ అభిప్రాయ సేకరణ చేసింది. బీఆర్ఎస్ కు 44.15 శాతం ప్రజలు మొగ్గుచూపారు. కాంగ్రెస్ కు 35.86 శాతం మద్ధతు తెలుపగా, బీజేపీకి 14.30శాతం, ఇతర పార్టీలకు 5.69 శాతం మంది మద్ధతు తెలిపారు. ప్రధానంగా ఫించన్ లు, ఇందిరమ్మ ఇళ్లు, మౌలిక వసతుల కల్పన ప్రజలు వ్యతిరేకత తో ఉన్నారు. ఫించన్లు

APB News Survey report

పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్ల గురించే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఫించన్లు పెంచకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మిర్యాలగూడ టౌన్లో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇళ్ల పైన జనాల్లో వ్యతిరేకత ఉందని పసిగట్టిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఆగమే ఘాల మీద ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మరింత బద్నాం అయ్యారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండానే పార్టీ ఆఫీసుల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం విమర్శలకు దారితీసింది.

మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు హైదరాబాద్ కేంద్రంగా వేలం పాటలు పెట్టారని టాక్ వినిపించింది. చైర్మన్ పదవికి రూ.15కోట్లు, కౌన్సిలర్కు రెండు కోట్లు ఎవరు ఖర్చు పెడతారో వాళ్లకే పార్టీ టికెట్లు అని జరిగిన ప్రచారం మిర్యాలగూడ కాంగ్రెస్లో గుబులు రేపింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తిరునగరు భార్గవ్ వర్గానికి టికెట్లు ఇవ్వకుండా కోత పెట్టేందుకు వేలం పాటలు తెరపైకి తెచ్చారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. బీఆర్ఎస్ 38 వార్డులతో తొలి జాబితా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్లో శుక్రవారం వరకు కూడా అభ్యర్థులను తేల్చలేకపోయారు. భార్గవ్ వర్గం 12 టికెట్లు కోరుతోంది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి వర్గీయులు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ల పంచాయితీ తేలకపోవంతో శుక్రవారం మరోసారి ఎంపీ రఘువీర్ రెడ్డి మిర్యాలగూడకు వచ్చారు. అభ్యర్థుల ఎంపికలోనే గందరగోళ పరిస్థితులు నెల కొనడం బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ మారింది.

APB News Survey Report

బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో ముందు నుంచి జాగ్రత్తలు పాటిస్తోంది. మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు, ఆయన కొడుకు సిద్ధార్ధ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సర్వేలు చేయించారు. ఏ వార్డులో ఎవరు బాగుంటరు? నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న అభ్యర్థి ఎవరు? ఏ వార్డులో ఏ వర్గం అభ్యర్థిని నిలబెడితే గెలుస్తారు? అనే కోణంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మెజార్టీ అభిప్రాయం మేరకు అభ్యర్థులను వడపోసింది. గతంలో బీఆర్ఎస్ను వీడివెళ్లిన వారిని కూడా పార్టీలోకి సాధరంగా ఆహ్వానం పలికింది.

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒంటెద్దు పోకడలు బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. గత రెండేళ్లలో మిర్యాలగూడ అభివృద్ధికి నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఆడపాదడపా చేపట్టిన రోడ్లు, గత ప్రభుత్వంలో మధ్యలో వదిలేసిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం మినహా ప్రజలకు వార్డుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. ఆర్య వైశ్యులు బలంగా ఉన్న మిర్యాలగూడలో మాజీ చైర్మన్ భార్గవ్ ప్రాధాన్యతను పార్టీలో తగ్గించేందుకు ఆయన్ని ఒంటిరిని చేయాలనే ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి భార్యకు ఇవ్వాలని డిసైడ్ చేయడం వెనక ఆర్ధిక ప్రయోజనాలు తప్పా మరొకటి లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Share
Share