నల్లగొండ బీఆర్​ఎస్​ మేయర్​ అభ్యర్థిగా చకిలం వసంత అనిల్​ కుమార్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ భార్య చకిలం వసంత బరిలో దిగనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అనిల్ భార్య వసంతను మేయర్ పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. శ్రీ నివాస్రావు వారసుడిగా అనిల్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ హయాంలో బ్రహ్మణ పరిషత్ కార్పోరేషన్లో మెంబర్గా ఉన్నారు. గతంలో నల్లగొండ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ బీఆర్ఎస్లో అవకాశం దక్కలేదు. మధ్యలో బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయిన అనిల్ కుమార్ మళ్లీ కొంత కాలం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేరకు నల్లగొండ మేయర్కు పోటీ చేయాలని కోరారు.

అనిల్ కుమార్ తండ్రి చకిలం శ్రీనివాస్ రావు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా శ్రీనివాస్రావు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసించారు. వసంత తండ్రి నర్సింహారావు కరెన్సీ తయారీ సంస్థలో కీలకమైన పోస్టులో పనిచేశారు. 48 వార్డు నుంచి వసంత పోటీ చేయనున్నారు. ఈమేరకు గురువారం పార్టీ అధికారికంగా ప్రకటించనుంది.

Share
Share