అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
కాంగ్రెస్ అధికారాన్ని కూల్చేసేందుకు బీఆర్ఎస్ కుట్రలు
జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ
దేవరకొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులకు భవిష్యత్తులో తగిన న్యాయం చేస్తామని జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. మంగళవారం దేవరకొండలో జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే బాలూనాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని, 70 శాతం సర్పంచ్లు గెలిచినట్టుగానే అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల ని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ అధికారాన్ని కూల్చడానికి ఆలోచనలు చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలగా మార్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
విద్యా రంగం లో పెను మార్పులు చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని, ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి యూనివర్సిటీ కి నిధులు మంజూరు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పాలన అని గుర్తుంచుకోవాలని, అన్ని వర్గాల నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని మంత్రి అడ్లూరి పిలుపుని చ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు రానివాళ్లకు తగిన న్యాయం చేస్తాం: మంత్రి అడ్లూరి