రెండు లక్షలు ఉన్న ఫీజు మూడు లక్షలు చెప్పి మోసం చేస్తున్నరు
సీఎం రేవంత్ కొడంగల్‌కు ఎన్ని నిధులు తీసుకపోతే.. నల్గొండకు అన్ని నిధులు తెస్తా
నల్లగొండ బొట్టుగూడ స్కూల్ ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నాకు ఛాన్స్ లభిస్తే రాష్ట్రంలోని కార్పోరేట్ స్కూళ్లను బంద్ చేయడం ఖాయమని ఆర్ అండ్ బి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన బొట్టుగూడ్ ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యా ఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్లగొండకు అన్ని నిధులు తెస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే 2 వేల కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేస్తున్నామని, మెగా స్మార్ట్ సిటీగా నల్లగొండను తీర్చిదిద్దాలన్నదే నాలక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రధానంగా విద్యా, వైద్యం, పేదలకు ఇళ్లు, తాగునీరు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం పైనే దృష్టి పెట్టానని మంత్రి తెలిపారు. ప్రచారం తక్కువ…పనులు ఎక్కువ కాన్సెప్ట్ లో తాను ముందుకు పోతున్నానని దీనిలో భాగంగానే బొట్టుగూడ స్కూల్‌ను నిర్మించడం జరిగిందన్నారు.
పేదలను దోచుకుంటున్న కార్పోరేట్ విద్యా సంస్థలు
స్కూళ్ల సీజన్ రాగానే నాకు భయం వేస్తుందని మంత్రి అన్నారు. నేను రికమండ్ చేసి పంపిన విద్యార్థులను సైతం చైతన్య, నారాయాణ విద్యాసంస్థలు మోసం చేస్తుంటారని, కార్పోరేట్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చి పేద ప్రజలను దోచుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. రెండు లక్షలు ఉన్న ఫీజును మూడు లక్షలకు పెంచి, నేను ఫోన్ చేయగానే రెండు లక్షలకు తగ్గించామని చెప్తుంటారని మంత్రి తెలిపారు. నారాయాణ, చైతన్య విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య ఉండదని, అక్కడ అంతా డిగ్రీ చదివినోళ్లో టీచర్లుగా పనిచేస్తుంటారని, కానీ నల్లగొండలో పీజీ, గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్లు టీచర్లుగా, లెక్చరర్లుగా పనిచేస్తుంటారని, నాణ్యమైన విద్య నల్లగొండలోనే లభిస్తదని అన్నారు. నల్లగొండలో కార్పోరేట్ దోపిడీ లేదని, నేను ఫోన్ చేయగానే చాలా మంది 50వేల ఫీజును కూడా 20 వేలకు తగ్గిస్తారని, ఇంకొందరు అసలు ఫీజు తీసుకోరని చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పోరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేద ప్రజలకు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కార్పోరేట్ దొంగలు పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.
30 మంది స్టూడెంట్స్ 10 మంది టీచర్లు
ఇటీవల మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి సందర్శించినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం, టీచర్లు వచ్చి స్కూల్ కాంపౌడ్ కావాలని అడిగారు. వెంటనే మంజూరు చేయాలని అనుకన్నా, కానీ ఆ స్కూళ్లో ఎంత మంది విద్యార్థులు, టీచర్లు ఉన్నారని ఆరా తీస్తే 30 మంది విద్యార్థులకు 10 మంది టీచర్లు పని చేయడం ఆశ్యర్యానికి గురిచేసింది, దాంతో వచ్చే ఏడాది 200 మంది స్టూడెంట్స్‌ను పెంచిన తర్వాతే కాంపౌడ్ వాల్ కట్టిస్తానని చెప్పానని మంత్రి పేర్కొన్నారు.
రాజకీయాలను తప్పుకుంటే బొట్టుగూడ స్కూల్లోనే ఉంటా
బొట్టుగూడ స్కూల్ వాతావరణం చూస్తుంటే భవిష్యత్తులో ఈ స్కూల్లో ఒక రూమ్ తీసుకుని ఇక్కడే పిల్లలను చదవించుకుని జీవితం గడపాలనిపిస్తోందిని మంత్రి బావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా నల్లగొండ ప్రజలు గెలిపించారని, వాళ్ల కోసం ఏం చేసినా తక్కువేనని అన్నారు. నా ఆరోగ్యం సహరించకపోతే, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తే బొట్టుగూడ స్కూల్లో రూమ్ తీసుకుని ఇక్కడి పిల్లలను నా సొంత పిల్లల మాదిరి చదివించుకుంటానని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, తమ పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించాలని, స్కూల్లో విద్యార్థుల సంఖ్య పడిపోకుండా కలెక్టర్, డీఈఓ మానిటరింగ్ చేయాలని మంత్రి సూచించారు.
Breaking News: నేనే ఎడ్యుకేషన్ మంత్రిని అయితే…కార్పోరేట్ స్కూళ్లను మూతపడేస్తా: మంత్రి కోమటిరెడ్డి