- జెండాను ఆవిష్కరించిన అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,
- హాజరైన జర్నలిస్టులు
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ లోని రామగిరి లో గల ప్రెస్ క్లబ్లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్లస్థలాలు ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, సంయుక్త కార్యదర్శి ఎండి సయ్యద్, జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ బాధ్యులు సుధాకర్, ఉయ్యాల లింగయ్య , డిఎస్ యాదవ్, కారింగు శ్రీను, దోటి శ్రీనివాస్, మదన చారి, జాజాల కృష్ణ, దశరథ, తదితరులు పాల్గొన్నారు.