Big Breaking News: నల్గొండ మేయర్ రేసులో బిగ్ షాట్..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్గొండ మేయర్ రేసులో ప్రముఖ మహిళా బిగ్ షాట్ రంగం లోకి దిగుతున్నట్టు విశ్వనీయ సమాచారం. బీ ఆర్ ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా బలమైన వ్యక్తి నీ నిలబెట్టేందుకు అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నల్గొండ టీడీపీ లో చక్రం తిప్పిన ప్రముఖ రాజకీయ నేత కుమార్తె ను మేయర్ గా పోటీ చేయమని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ కేడర్ లో జోరుగా చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్ కు ధీటుగా ఆర్థికంగా, సామాజికంగా కలిసి వచ్చే మహిళను పోటీ లో దింపితే రాజకీయం రసవత్తరంగా ఉంటాదని సీనియర్లు సూచిస్తున్నారు. నల్లగొండ లో వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా వ్యాపార వేత్త ను పార్టీ లో చేర్చుకొని మేయర్ గా నిలబెట్టాలని చూస్తున్నారు. మరో వైపు బీజేపీ, కమ్యూనిస్టులు కూడా తోడైతే మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Share
Share