హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కొత్త ఏడాది 2026 ప్రారంభం కావడంతో పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు, వివాహ నిశ్చయ తాంబూలాలు మార్చుకున్న వారు శుభ ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఈ ఏడాదిలో వివాహాలకు సంబంధించి గురు, శుక్ర మూఢమి ప్రభావం మరియు అధిక మాసాల ప్రభావం ఉంది. ఫిబ్రవరి మధ్య వరకు ముహూర్తాలు లేకపోయినా, ఆ తర్వాత నుంచి ఏడాది చివరి వరకు అద్భుతమైన ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయని పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు.
ఫిబ్రవరి 14 తర్వాతే శుభారంభం
సాధారణంగా వివాహ ముహూర్తాలకు గురు, శుక్ర గ్రహాల బలం ముఖ్యం. జనవరి నెల మొత్తం మరియు ఫిబ్రవరి 14 వరకు మూఢమి (మౌఢ్యమి) ప్రభావం ఉండటంతో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టకూడదు. ఫిబ్రవరి 19 నుంచి మాత్రమే అసలైన వివాహ ఘడియలు ప్రారంభం కానున్నాయి.
నెలవారీగా 2026 వివాహ ముహూర్తాల వివరాలు:
- ఫిబ్రవరి: 19, 20, 21, 22, 24, 25, 26.
- మార్చి: 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29.
- ఏప్రిల్: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 26, 28, 29, 30.
- మే: 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13. (గమనిక: మే 18 నుండి జూన్ 11 వరకు అధిక జ్యేష్ఠ మాసం కారణంగా విరామం).
- జూన్: 19, 20, 21, 24, 25, 27, 28.
- జూలై: 1, 2, 3, 4, 5, 8, 9.
- ఆగష్టు: 16, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30.
- సెప్టెంబర్: 1, 3, 4, 5.
- అక్టోబర్: 11, 14, 29, 30.
- నవంబర్: 11, 13, 14, 18, 19, 20, 21, 22, 24, 25, 26.
- డిసెంబర్: 2, 3, 10, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 31.
నిపుణుల సూచన
ఈ ముహూర్తాలు సాధారణ పంచాంగం ప్రకారం ఉన్నవని, వధూవరుల వ్యక్తిగత జన్మ నక్షత్రాలు మరియు జాతక చక్రాల ఆధారంగా ఖచ్చితమైన ముహూర్తాన్ని పండితుల ద్వారా నిర్ణయించుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.