ఆంధ్ర ప్రదేశ్ ఏపీబి న్యూస్: సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరు, పల్లెటూరు వాతావరణం, రంగు రంగుల రంగవల్లిలు, ఆడపడుచుల ఆటపాటలు, ఏ ఇంట్లో చూసినా గుమగుమలాడే కమ్మని పిండి వంటలు, కొత్త అల్లుళ్ల కోలాహలం, కోనసీమ అందాలు, ఇంకా నీసుకైతే కొదవలేదు. సంక్రాంతి పండుగ పర్వదినంగా మూడు రోజులపాటు భీమవరంలో జరగనున్న కోడిపందాలు. ఇక కోడిపందాలు అత్యంత ప్రసిద్ధమని చెప్పుకోవచ్చు. సంక్రాంతి అంటేనే కోడి కోడిపందాలు అనేలాగా ఆంధ్రాలో ఎవరిని అడిగిన, ఏ చిన్నపిల్లవాని అడిగిన వీటి గురించే డిస్కషన్.


అయితే ఆంధ్ర నే కాదు, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుండి భారీగా ఈ కోడిపందాలను వీక్షించడానికి వస్తుంటారు. దేశ నలుమూలల నుండి ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అందరు ఆట పాటల తోటి చాలా సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కోడి పందాలు చాలా జోరుగా జరుగుతున్నవి. దీనికి తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు.


పెద్ద పెద్ద గ్రౌండ్లో భారీ టెంట్ల తోటి, కోడి పందాల ఆట స్థలాలను చాలా సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కోడిపందాలను ఆస్వాదించడానికి భారీ ఎల్ఈడీ(LED) స్క్రీన్ కూడా అమర్చి కోడిపందాలను జోరుగా సాగిస్తున్నారు. అటు దేశ నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్న ప్రజానీకానికి, మరియు వారి యొక్క వెహికల్స్ కి పార్కింగ్ స్థలాన్ని పెద్ద పెద్ద గ్రౌండ్స్ లో అరేంజ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ప్రజలకు సహకారం అందిస్తున్నారు. ఎలాంటి చెదురు ముదురు ఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు కట్టుదితమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు.



అయితే ప్రతి ఏడాది జరిగే ఈ కోడిపందాలలో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. ఈసారి కోడిపందాలు కొంత శృతి తప్పినట్టు అనిపిస్తుంది. బయట కోడిపందాలు, లోపట పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కోడిపందాలను వీక్షించడానికి సినీ నటుడు శ్రీకాంత్ కొడుకు నటుడు రోషన్, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
