- అసెంబ్లీలో హారీష్ హైడ్రామా ?
- బాయ్‌కాట్ హారీష్ నిర్ణయమా? పార్టీ పెద్దలదా?
- కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే చరిత్రలో క్షమించరాని తప్పు చేసినట్లే..
- అడ్డగోలు అవినీతి చేసిర్రు కాబట్టే హారీష్, జగదీష్ పైన ఫైర్..
- హారీష్ ఓ గుంట నక్క ?
- పార్టీలో ఆయనకు ప్రత్యేకంగా ఓ గుంపు తయారుచేస్తున్నడు: జనజాగృతి బాటలో కల్వకుంట్ల కవిత
సూర్యాపేట, ఏపీబీన్యూస్: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ది ఒక డ్రామా అయితే, బీఆర్ఎస్ది మరొక హైడ్రామా అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ హారీష్రావును తిట్టినందుకే అసెంబ్లీని వాయిదా వేసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని, కేసీఆర్ను తిట్టినప్పుడు ఈ గుంటనక్క అలాగే వ్యవహారించిండా? అని ప్రశ్నించారు. ఆయన్ని సీఎం రేవంత్ ఒక్క మాట అన్నందుకే సభను వాయిదా వేసుకుని వెళ్లిపోవడం వెనక పెద్ద హైడ్రామా ఉందని ఫైర్ అయ్యారు.
డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో సభను వాయిదా వేసిండా? లేదంటే పార్టీ అధినాయకత్వం చెప్పిందా? కేటీఆర్ చెబితే సభ నుంచి వెళ్లిపోయిండా? అన్నది చెప్పాలని సవాల్ విసిరారు. నాకు తెలిసినంత వరకు ఇది హారీష్రావు నిర్ణయంగానే కనిపిస్తోందని, మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా, శ్రీనివాస్ యాదవ్ కూడా తమ టైమ్ హరీష్ రావు కే ఇవ్వమన్నారని చెప్తున్నారంటే పార్టీలో తనకంటూ ఒక గుంపును తయారు చేసుకుంటున్నాడని కవిత ఆరోపించారు. అసెంబ్లీ మాట్లాడే అవకాశం వదిలి బయట సభలు పెట్టి ప్రజలకు వివరిస్తారా? అని నిలదీశారు. తెలంగాణకు 3 శాతం నీళ్ల వాటా తగ్గించే ఒప్పందం పై హరీష్ రావు సంతకం చేశారా? లేదా? జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి? అని సవాల్ విసిరారు. సభలో మూసీ, జీహెచ్ఎంసీ కి సంబంధించిన డివిజన్లపై చర్చ జరిగితే ప్రతిపక్షం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్లో తోక కుక్కను ఊపే పరిస్థితి..
సభను వాయిదా వేయాలనే నిర్ణయం కేసీఆర్, కేటీఆర్ తీసుకుని ఉంటే అది శ్రేయస్కరమైన పద్ధతి కాదన్నారు. కృష్ణా నది నీళ్లపై సభలు పెడతామని చెప్పిన కేసీఆర్, చట్ట సభలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం సరికాదన్నారు. ప్రజలు ఏమనుకున్న సరే బీఆర్ఎస్ లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చిందని, ప్రతిపక్షం లేకపోవటంతో కాంగ్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్పారని అన్నారు. మేము పార్లమెంట్ లో ఉన్నప్పుడు కూడా అంశాలను బట్టి వ్యతిరేకత చెప్పే వాళ్లం, మళ్లీ వేరే అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వాళ్లం, నిన్న జీహెచ్ఎంసీ ని 300 డివిజన్ చేసే బిల్లు పెట్టారు. అది అవసరం లేదా? అని నిలదీశారు.

హారీష్రావు…ఈ ప్రశ్నలకు బదులు చెప్పాల్సిందే
హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట? అంతకు ముందు ఆయనను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా తెలంగాణకు 3 శాతం నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది మీరు కాదా? ఇప్పటికే కట్టిన ప్రాజెక్ట్ లపై తెలంగాణకు 37 శాతం, ఆంధ్రాకు 63 శాతం వాటా ఉండేది. కానీ కాళేశ్వర రావు అని పిలిపించుకున్న హరీష్ రావు మనకు 34 శాతం నీళ్ల వాటాకే అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇది నిజమా? కాదా? చెప్పాలి. నేను అడి గిన ప్రశ్నలకు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సమాధానం చెప్పాలి. జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూడా చెప్పాలి. అప్పుడు కేసీఆర్ గారు చాలా చెప్పారు, కానీ అవి కాలేదు.
హరీష్ రావు ధనదాహాం కారణంగానే ఇన్ టేక్ పాయింట్ శ్రీశైలం కు మారింది. ఏల్లూర్ పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చారు, అందుకు దాదాపు 14 వందల కోట్లు ఖర్చు పెట్టారు, దీని కారణంగా 30 మీటర్ల ఎత్తు పెరిగి మనం తీసుకోవాల్సిన వాటర్ కెపాసిటీ తగ్గింది. పైగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కారణంగా కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ లో మోటార్లు చెడిపోయాయి, మొత్తం 5 మోటార్లకు గాను ఇప్పటి వరకు 3 మోటార్లే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ కూడా చేయలేదు. కచ్చితంగా నేను అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో చెప్పే అంశాలను పార్టీ ఆఫీస్ లో చెప్పటం సరికాదు. హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటేనే ఆయనకు రేవంత్ తో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉంటాయి. కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చితే నేనే రియాక్ట్ అయ్యా, బీఆర్ఎస్ నుంచి ఎవరు స్పందించలేదని కవిత అన్నారు.
హారీష్, జగదీష్ అవినీతి పరులు…
హారీష్రావు, జగదీష్ రెడ్డి పైన వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. కానీ అవినీతి పరుల పైన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఓటుకు పది వేలు ఇచ్చి తండ్రిని సర్పంచ్ గా గెలిపించుకుండని జగదీష్ రెడ్డి పైన మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్, జగదీష్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులని అందుకునే సూర్యాపేట లో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉత్తమ్ స్పందించడని కవిత ఆరోపించారు. అవినీతి కారణంగా ప్రజలకు కావాల్సిన మేలు, ప్రయోజనాలు జరగవని, నేను మాట్లాడటం కారణంగా జగదీష్ రెడ్డి చుట్టు ఉన్న వాళ్లు నాపై ఏడుస్తారని, కానీ సూర్యాపేట జిల్లాలోని పది లక్షల మంది ప్రజల కోసం మాట్లాడుతున్నానని చెప్పారు. సూర్యాపేట లో జగదీష్ రెడ్డి అనుచరులు గుడులను, చెరువులను కూడా వదిలిపెట్టలేదని అన్నారు.