దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన కార్యవర్గ మరియు శ్రీ. ఈశ్వర వీరప్పయ్య దేవస్థాన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR), మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా దేవరకద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కథలప్ప, దేవస్థానంలో నిర్వహించిన ప్రమాణస్వీకారంలో దేవస్థాన చైర్మన్ గా బీసు నరసింహ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ…. నిస్వార్ధంగా కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయ్.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో సీనియర్ నాయకులు కథలప్ప గారిని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టిన, పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి నిస్వార్ధంగా పనిచేశారు. కష్టపడ్డ వారికి ఒక్కొక్కరిగా ప్రాధాన్య క్రమంలో పదవులు దక్కుతాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి – సమిష్టిగా కలిసి పని చేద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన విధంగా స్థానిక ఎన్నికల్లో పనిచేసి విజయకేతనం ఎగరవేద్దాం. అందరి అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తాం, పార్టీ నిర్ణయించిన వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి – బిఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిన, ఆర్థిక వ్యవస్థ ను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.
దేవరకద్ర నియోజకవర్గంలో 224 కోట్ల ఋణమాఫీ జరిగింది, 46000 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. రైతులకు ఇచ్చిన మాట మేరకు 500 బోనస్ ఇవ్వడం జరిగింది, సంక్రాంతి తరవాత రైతు భరోసా తో పాటు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా ను అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి అడిగిందే తడవుగా కురుమూర్తి దేవస్థానం వద్ద ఎలివేటేడ్ కారిడార్ మరియు దేవరకద్రను మున్సిపాలిటీ గుర్తించడం తో పాటు నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ, కోర్ట్, ఇంటర్ నేషనల్ స్కూల్ మంజూరు చేశారు. త్వరలో దేవరకద్ర లో 100 పడకల ఆస్పత్రి కి శంకుస్థాపన చేయబోతున్నం, అజీలపూర్ లిఫ్ట్ కు ఆర్థిక అనుమతులు వచ్చాయి.
పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలమూరు జిల్లాలోని ప్రతి గ్రామానికి, తండా కు బిటి రోడ్లు రాబోతున్నాయి. దోచుకోవడం తప్ప బిఆర్ఎస్ చేసింది శూన్యం అని MLA GMR ఎద్దేవా చేసారు.