పోలీసుల కుటుంబాలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే ఏనాడు పట్టించుకోని బండి సంజయ్
మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ డివిజన్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి గతంలో కెసిఆర్ హయాంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయల చెక్కు మాత్రమే అందజేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వీరందరికీ కూడా భవిష్యత్తులో తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా ఏ రంగం చూసినా అతలాకుతలం అయిందని పరిపాలన పై అవగాహన లేకుండా పరిపాలిస్తున్నారని 11 నెలల్లోనే వీరి పరిపాలన ప్రజలకు అర్థమైందని సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.
బండి సంజయ్ ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ లను తిట్టడం తప్ప ప్రజా సమస్యల పైన దృష్టి పెడితే బాగుండు కేంద్రమంత్రి పోలీసుల కుటుంబాలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే సమస్యలు కూడా తెలుసుకోకుండా రేపు తిట్ల పురాణం చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.