APB News Exclusive: నాడు మోత్కుపల్లి… నేడు వీరేశం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. ఒకప్పుడు టీడీపీ లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తరహాలోనే నేడు కాంగ్రెస్ లో వీరేశానికి విప్ హోదాతో తన స్థాయిని పెంచుకున్నారు. జనశక్తి నేపథ్యం నుంచి వచ్చిన వీరేశం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడే కేసీఆర్ దృష్టిలో పడ్డ వీరేశం టీఆర్ఎస్ లో చేరి మొదటి ఎన్నికల్లోనే నకేరికల్ ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వీరేశం దూకుడు నచ్చని నకేరికల్ ప్రజలు రెండో సారి తిరస్కరించారు. ఆ తర్వాత చిరుమర్తి లింగయ్య ను పార్టీ లో చేర్చుకోవడంతో వీరేశం సొంత అజెండా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారు. బీఆర్ఎస్ లో వీరేశం రాజకీయ ఎదుగదలను ఓర్వలేని కొందరి నాయకుల తీరు నచ్చిక కాంగ్రెస్ లో చేరారు. అప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ఉన్న స్నేహ బంధం ఆయనకు మరింత కలసి వచ్చింది. దాంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరి ఘన విజయం అందుకున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు మాదిగ కోటా లో మంత్రి పదవి వస్తదని ఆశించారు. కానీ రాష్ట్ర, జిల్లా రాజకీయ సమీకరణలు కుదర లేదు. ఇప్పుడు కూడా విప్ పదవి కోసం చొప్పదండి ఎమ్మెల్యే మేడి పల్లి సత్యం పోటీ పడ్డారు. కానీ వీరేశం సీనియారిటీ దృష్ట్యా ఆయనకు కేబినెట్ హోదా దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే సామాజిక వర్గం నుంచి మోత్కుపల్లి, ఆకారపు సుదర్శన్ లకు సముచిత స్థానం దక్కింది. మళ్ళీ అదే వర్గం నుంచి వీరేశం ఎదుగుదల కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వీరేశం అసెంబ్లీ లో విప్ హోదా లో ప్రభుత్వ ప్రతినిధిగా బీఆర్ఎస్ నేతల పై ఎదురు దాడికి బలమైన అస్త్రమని అంటున్నారు.

శాసన మండలి లో ప్రభుత్వ ప్రతినిధిగా దయాకర్ కీలక పాత్ర పోషించనున్నారు. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే గా పోటి చేసి ఓడిన దయాకర్ ను ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. గత ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసినందుకు గాను అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ నీ చేసింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కోటా లో ఆయనకు విప్ హోదా దక్కింది. మాల వర్గానికి చెందిన దయాకర్ పార్టీ అధికార ప్రతినిధి గా తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు మండలి లో ప్రతి పక్ష పార్టీ నీ ఇరకాటం లో పడేసేందుకు విప్ హోదా కలసి రానుంది.

ప్రస్తుతం ప్రభుత్వ చీప్ విప్ గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఉన్నారు. చీప్ విప్ అడగకపోయినా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా లో బీసీ లకు సముచిత స్థానం కల్పించాలని చీప్ విప్ హోదా కల్పించారు. మళ్ళీ ఇప్పుడు అటు సూర్యాపేట, ఇటు నల్లగొండ జిల్లాకు కు రెండు విప్ పదవులు దక్కాయి. దీంతో ఇద్దరు మంత్రులకు సమానంగా ఈ ముగ్గురికి కేబినెట్ హోదా దక్కడం విశేషం.

Share
Share