Breaking News: ఇద్దరు రైస్‌ మిల్లర్ల అరెస్ట్‌: ఎస్పీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం కలిగించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించిన ఏడు మిల్లుల యజమానులపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పౌరసరఫరాల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2022–23 యాసంగి సీజన్లో నల్లగొండ పరిసర ప్రాంతాల్లోని సుమాంజలి పార్బాయిల్డ్ (ఆర్జాలబావి), వరలక్ష్మి పార్బాయిల్్డ(చిట్యాల), మనోహర్ ఆగ్రో ఫుడ్ ప్రొడక్్ట్స (మునుగోడు) ఈ మూడు రైస్ మిల్లుల ద్వారా 13170.061 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి రూ.43 కోట్లు నష్టం కలిగించారు.

వీరిపై చిట్యాల, నల్లగొండ రూరల్, మునుగోడు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ మిల్లుల్లో ప్రదాన పాత్రదారి అయిన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మను బుధవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ మండలం దోమలపల్లి శివారులో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరో నాలుగు మిల్లులకు చెందిన మాశెట్టి రాధాకృష్ణ, మేడమ్ కృష్ణమూర్తి, ఇడుకుళ్ల దామోదర్, కందుకూరి రవికుమార్, బూరుగు బాలకృష్ణ పరారీలో ఉన్నారని తెలిపారు. అరెస్టయిన వారి నుంచి కారు, 3 సెల్ఫోన్లు, రూ.1,09,000 స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, నార్కట్పల్లి సీఐ నాగరాజు, నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తదితరులు పాల్గొన్నారు.

Share
Share