- 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీ జనాభా లెక్కలు వెల్లడించిన మున్సిపల్ శాఖ
- ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీల్లో 407 వార్డులు,
- ఎస్సీ ఎస్టీ జనాభా 8,32,194, ఎస్టీలు 44,040, ఎస్సీలు 1,14,104
- నేటి నుంచి మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితా పైన కసరత్తు
- జనవరి 10 ఫైనల్ ఓటరు జాబితా వెల్లడి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు సోమవారం మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డులు, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను వెల్లడించింది. దీంతో పాటు ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రిపేర్ చేయాలని, నేటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టేందుకు షెడ్యూల్ ప్రకటించింది. 30 నుంచి జనవరి 9 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని మున్సిపల్ శాఖ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి ఎన్నికల సంఘం ప్రకటించిన అసెంబ్లీ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫైనల్గా జనవరి 10న వార్డుల వారీగా ఓటరు జాబితా అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిష్ చేయాలని ఆదేశించింది.
ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 మున్సిపాలిటీల్లో 407 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా 8,32,194 మంది ఉన్నారు. దీంట్లో ఎస్సీ జనాభా 1,14,104 కాగా, ఎస్టీ జనాభా 44,040 మంది ఉన్నారు.
షెడ్యూల్ ఇదీ…
నేడు అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రిపేర్ చేయాలి. 31న వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల వివరాలు ప్రకటిం చాలి. జనవరి 1న ముసాయిదా జాబితా ప్రకటించాలి. జనవరి 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్లు నిర్వహిస్తారు. 6న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ మీటింగ్ నిర్వహించాలి. జనవరి 10 తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
| మున్సిపాలిటీ | వార్డులు | జనాభా | ఎస్టీలు | ఎస్సీలు |
| చండూరు | 10 | 12,889 | 144 | 1237 |
| చిట్యాల | 12 | 14,986 | 212 | 2642 |
| దేవరకొండ | 20 | 29,731 | 3720 | 2894 |
| హాలియా | 12 | 17,731 | 860 | 2193 |
| మిర్యాలగూడ | 48 | 1,09,891 | 6069 | 15637 |
| నల్లగొండ | 48 | 1,90,261 | 2812 | 31,821 |
| నందికొండ | 12 | 15,887 | 1003 | 3086 |
| హుజూర్నగర్ | 28 | 35,850 | 537 | 4219 |
| కోదాడ | 35 | 75093 | 4185 | 10556 |
| నేరేడుచర్ల | 15 | 14,853 | 394 | 3,183 |
| సూర్యాపేట | 48 | 1,39,399 | 20,393 | 10,471 |
| తిరుమలగిరి | 15 | 18,474 | 1,607 | 3,671 |
| ఆలేరు | 12 | 17,120 | 122 | 2,616 |
| భువనగిరి | 35 | 66,256 | 903 | 8,597 |
| చౌటుప్పుల్ | 20 | 31,202 | 553 | 4,471 |
| మోత్కూరు | 12 | 15,924 | 117 | 2,973 |
| పోచంపల్లి | 13 | 17,010 | 196 | 1947 |
| యాదగిరిగుట్ట | 12 | 15,637 | 213 | 1,890 |