తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం… సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

  • సహకార సంఘాల పాలకవర్గాలు రద్ధు
  • డీసీసీబీ, ప్యాక్స్​ పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం
  • పర్సన్​ ఇన్​చార్జిలుగా కలెక్టర్లు​, సొసైటీ ఆఫీసర్లు
  • నల్లగొండ డీసీసీబీ బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్​ త్రిపాఠి
  • డీసీసీబీల పైన హైకోర్టులో పీటీషన్​ వేసిన వైస్​ చైర్మన్ ఏసిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్​, డీసీసీబీల పాలకవర్గాలను రద్ధు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీల పర్సన్​ ఇన్​చార్జిలుగా జిల్లా కలెక్టర్లు, సొసైటీలకు సహకార ఆఫీసర్లను పర్సన్​ ఇన్​చార్జిలుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీ ఎన్నికలు నిర్వహించేంత వరకు పర్సన్​ ఇన్​చార్జిలుగా కలెక్టర్లు, సొసైటీ ఆఫీసర్లు వ్యవహారిస్తారు. నల్లగొండ జిల్లా డీసీసీబీ వైస్​ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్​ విచారణలో ఉండగానే ప్రభుత్వం రద్ధు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టున ప్రభుత్వం డీసీసీబీ చైర్మన్​, సొసైటీ పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడగించింది. బ్యాంకు డైరక్టర్లు, వైస్​ చైర్మన్​ పదవీ కాలాన్ని  పొడగించకపోవడంతో నల్లగొండ జిల్లా వైస్​ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​ రెడ్డి హైకోర్టులో పిటీషన్​ దాఖలు చేశారు. రాష్ట్రంలోని 9 డీసీసీబీ ల పైన కోర్టులో పిటీషన్​ విచారణ జరుగుతోంది. ఇటీవల జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున హైకోర్టుకు అడ్వకేట్​ జనరల్​ హాజరయ్యారు. పదవీకాలం పొడగింపులో చైర్మన్​ ఒక్కరికే అవకాశం ఇవ్వడం, డైరక్టర్లు, వైస్​ చైర్మన్​ పదవీకాలాన్ని పొడగించకపోవడం పైన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని పైన ఇరువైపుల వాదోపవాదనలు జరుగుతున్నాయి. వచ్చే సోమవారం హైకోర్టులో మరోసారి వాధనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రద్ధు నిర్ణయాన్ని ప్రకటించడం హర్షనీయమని వైస్​ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​ రెడ్డి తెలిపారు.

నల్లగొండ డీసీసీబీ రాజకీయం అనేక మలుపులు తిరిగింది. 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ, సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీఆర్​ఎస్​ పాలన లో డీసీసీబీ చైర్మన్​గా గొంగడి మహేందర్​ రెడ్డి, వైస్​ చైర్మన్​గా ఏసిరెడ్డి దయాకర్​ రెడ్డి ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది డైరక్టర్లలో కాంగ్రెస్​ సపోర్ట్​తో కుంభం శ్రీనివాస్​ రెడ్డి ఒక్కరే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శ్రీనివాస్​ రెడ్డి చైర్మన్​ మహేందర్​ రెడ్డి పైన అవిశ్వాసం ప్రతిపాధించారు. ఈ మేరకు అప్పటి వరకు బీఆర్​ఎస్​లో ఉన్న డైరక్టర్లు 15 మంది శ్రీనివాస్​ రెడ్డికి మద్ధతు తెలిపారు. 18 రోజుల పాటు క్యాంపు రాజకీయాలు నడిపారు. మహేందర్​ రెడ్డి సైతం తన పదవి కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో చివరకు ఆయనే పదవీ నుంచి తప్పుకున్నారు. గతేడాది జూన్​ లో మొదలైన డీసీసీబీ అవిశ్వాస రాజకీయంగా నెలాఖరులో అవి శ్వాస తీర్మానం ఆమోదంతో తెరపడింది. గతేడాది జులై 1న శ్రీనివాస్​ రెడ్డి చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు.

కుంభం శ్రీనివాస్​ రెడ్డి చైర్మన్​గా ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు. గతేడాది జులై 1న చైర్మన్​గా ఎన్నికైన శ్రీనివాస్​ రెడ్డి పదవీకాలాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడగించింది. అప్పుడు డైరక్టర్ల పదవీకాలం కూడా పొడగించారు. మళ్లీ రెండోసారి ఆగస్టు 14న గడువు పొడగించినప్పుడు చైర్మన్​ ఒక్కరి కే పదవీకాలాన్ని పొడగించింది. సొసైటీలకు మాత్రం డైరక్టర్లు, చైర్మన్​ల పదవీకాలాన్ని పెంచారు. దీంతో అప్పటి నుంచి నల్లగొండ డీసీసీబీలో గొడవలు మొదలయ్యాయి. పాలకవర్గంలో తలెత్తిన విభే ధాల వల్ల ఏసిరెడ్డి దయాకర్​ రెడ్డి హైకోర్టులో పిటీషన్​ వేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యంత సన్నిహితుడైన దయాకర్​ రెడ్డి పిటీషన్​ వేయడం డీసీసీబీలో చర్చకు దారితీసింది. నల్లగొండలో 42, సూర్యాపేటలో 47, యాదాద్రి జిల్లాలో 21 సొసైటీలకు డీసీఓ లు పర్సన్​ ఇన్​చార్జిలను నియమిస్తారు. శుక్రవారం జిల్లా కలెక్టర్​ ఇలా త్రిపాఠి నల్లగొండ డీసీసీబీ పర్సన్​ ఇన్​చార్జి బాధ్యతలు చేపట్టారు. 

మాజీ చైర్మన్​ గొంగడి మహేందర్​ రెడ్డి హయాంలోనే డీసీసీబీ రూ. 2400 కోట్ల టర్నోవర్​ నమోదు చేసింది. ఆ తర్వాత శ్రీ నివాస్​ రెడ్డి హయాంలో మరో రూ.300 కోట్లకు పెరిగింది. మొత్తం రూ.2700 కోట్లతో రాష్ట్రంలో నల్లగొండ డీసీసీబీ రెండో స్థానంలో నిలిచింది. ప్రధానంగా పంట రుణాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు, బ్రాంచీల్లో అదునాతన సౌకర్యాలు, డీసీసీబీ ఆధునీకీకరణ, విదేశీ రుణాలు, గోల్డ్​ లోన్స్​లో అగ్రస్థానం సాధించింది. రుణాల రికవరీల్లో టాప్​లో నిలిచింది.

Share
Share