బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే పంచాయతీ ఎన్నికలు: బీసీ నాయకుల తీర్మానం

హైదరాబాద్ (APB News): ఈరోజు హైదరాబాద్ కాచిగూడ లో గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన బిసి మేధావుల సదస్సులొ పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు R కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి గుజ్జ రమేష్, మాజీ స్పీకర్ మధుసూదానా చారి, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వాకులభరణం కృష్ణమోహన్ మరియు వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, బీసీ యువజన సంఘల నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.

Share
Share