Breaking News: ఎమ్మెల్యే రెండు కోట్ల చెక్కు మర్మం ఇదేనా…?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన రెండు కోట్ల చెక్కు మర్మం వెనక దాగిన రహస్యం ఏంటన్నది ఇప్పటివరకు సస్పెన్స్గానే ఉంది. కానీ ఎమ్మెల్యే తన కుటుంబం మొత్తాన్ని రాజకీయాల్లో తెచ్చేందుకే రెండు కోట్ల చెక్కు ప్రభుత్వానికి ముడుపుగా చెల్లించారని ప్రచారం జోరు గా సాగుతోంది.

Bathula Madhavi Namination

ఎరువుల అక్రమ రవాణా సంఘటనలో విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ సంఘటన తర్వాత సీఎంను కలిసి రెండు కోట్ల చెక్కు అందజేశారు. రెండు కోట్లతో రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేయమని కోరారు. తన కొడుకు రిసెప్షన్ రద్ధు చేసి, దానికి అయ్యే రెండు కోట్ల ఖర్చు ను రైతులకు విరాళం ఇస్తున్నానని చెప్పి అప్పట్లో ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే భార్య మాధవి, ఆయన ఇద్దరు కొడుకులు నామినేషన్ వేయడంతో రెండు కోట్ల వెనక దాగిన రహస్యం దీంతో తేలిపోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

Bathula Laxma Reddy son
Bathula Laxma Reddy family
Share
Share