రెండో విడత పోలింగ్ పై ఉత్కంఠ!  539 సర్పంచ్​ స్థానాలకు, 4,280 వార్డులకు ఎన్నికలు

  • నేడు ఉమ్మడి జిల్లాల్లో  23 మండలాల పరిధిలో 539 సర్పంచ్​ స్థానాలకు, 4,280 వార్డులకు ఎన్నికలు
  • బరిలో ఉన్న సర్పంచ్​ అభ్యర్థులు 1645 మంది, వార్డు స్థానాలకు 10,729 మంది అభ్యర్థులు
  • ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నాం 1వరకు పోలింగ్​
  • కోదాడ, మిర్యాలగూడలో హోరాహోరీ

నల్లగొండ ప్రతినిధి : ఏపీబీ న్యూస్​, డిసెంబర్​ 13

ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. మొదటి విడత ఫలితాలు కాంగ్రెస్​ ఆశించిన స్థాయిలో మెజార్టీ సాధించలేకపోయింది. మాజీ ఎమ్మెల్యేలు ఆసక్తిచూపిన నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో ఆదివారం జరిగే రెండో విడతపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెబల్స్​ ప్రభావం, పార్టీలో వర్గపోరు, కోట్లు ఖర్చుపెడుతున్న ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారో అంచనా వేయలేకపోతున్నారు. మొదటి విడతలో రెబల్స్​ వల్ల పలు చోట్ల కాంగ్రెస్​కు నష్టం జరిగింది. ఇలాంటి సంఘటనలు రెండో విడతలో రీపీట్​ కాకుండా ఎమ్మెల్యేలు పక్కా ప్రణాళికతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. రెండో విడత  కోదాడ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, నాగార్జున సాగర్​ నియోజకవర్గాలో జరగనుంది. ఈ ఎన్నికల్లో మిర్యాలగూడ లోనే రెండుపార్టీల మధ్య వార్​ ఆసక్తికరంగా మారింది. మిర్యాలగూడలో కాంగ్రెస్​లో రెండు వర్గాలు ఉన్నందున దాన్ని బీఆర్​ఎస్​ కైవసం చేసు కునేందుకు ప్రయత్నిస్తోంది. పోల్​మేనేజ్మెంట్​తో సహా, అభ్యర్థుల ఎంపికలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్​రావు, ఆయన కొడుకు సిదార్ధ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యతిరేక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు ఈ ఎన్నికలనే అవకాశంగా మల్చుకున్నారు. నాగార్జునసాగర్​, కోదాడలో ఎమ్మెల్యేలు పద్మావ తి, జైవీర్​ రెడ్డి, ఎంపీ రఘువీర్​ రెడ్డి వార్​ వన్​ సైడ్​ అయ్యేందుకు పక్కా ప్రణాళికతో అభ్యర్థుల ఎంపిక చేశారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్​రావు వర్గీయులు సైతం పలు గ్రామాల్లో కాంగ్రెస్​లో రెబల్​ వార్​ నడుస్తోంది.

జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లు…

నల్లగొండ జిల్లాలో మొత్తం 10 మండలాల పరిధిలోని 281 పంచాయతీల్లో 38 ఏకగ్రీవం కాగా, 241 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 764 మంది సర్పంచ్​ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2,408 వార్డులకు గాను 55 3 ఏకగ్రీవం కాగా 1832 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 4,6 84 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1822 పోలింగ్​ స్టే షన్​లు ఏర్పాటు చేశారు. 241 జీపీల్లో వెబ్​ కాస్టింగ్​, 68 గ్రామాల్లో మైక్రో అభ్వర్జర్లును నియమించారు. 2,888 బ్యాలెట్​ బాక్సులు వినియోగిస్తున్నారు. 281 కౌంటింగ్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 3,28,016 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోను న్నారు. దీంట్లో పురుషులు 1,6 0,821, మహిళలు 1,67,166, ఇతరులు 29 మంది ఉన్నారు.

సూర్యాపేట జిల్లాలో…

సూర్యాపేట జిల్లాలో 8మండలాల పరిధిలో 181 పంచాయతీలకు గాను 23 ఏకగ్రీవం కాగా, 158 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 493 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1628 వార్డులకు గాను 339 ఏకగ్రీవం కాగా, 1287 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 3,224 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1462 పోలింగ్​ కేంద్రాల్లో 1609 బ్యాలెట్​బాక్సులు వినియోగిస్తున్నారు. 165 కౌంటింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 61మంది మైక్రో అభ్వర్జర్లు నియమించారు. 258 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 జీపీల్లో వెబ్​కాస్టింగ్​ జరగనుంది. మొత్తం ఓటర్లు 2,35,137మందికి గాను మహిళలు 1,114,803, పురుషులు 1,20,326, ఇతరులు 8 మంది ఉన్నారు.

యాదాద్రి జిల్లాలో… 

యాదాద్రి జిల్లాలో మొత్తం 150 జీపీలకుగాను 10 ఏకగ్రీవం కాగా, 140 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 388 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1332 వార్డులకు గాను 171 ఏకగ్రీవం కాగా, 1161 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,02,716 మందిలో పురుషులు 1,00,801, మహిళలు 1,01,915 మంది ఉన్నారు. 129 6 బాలెట్​ బాక్సులు వినియోగించున్నారు.

ఎన్నికలు జరిగే స్థానాల వివరాలు…

జిల్లాపేరుసర్పంచ్​ స్థానాలువార్డుస్థానాలుఓటర్లు
నల్లగొండ24118323,28,016
సూర్యాపేట15812872,35,137
యాదాద్రి14011612,02,716
Share
Share