Breaking News: ప్రభుత్వ విప్ లను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసనమండలి విప్లను అధికారికంగా నియమించింది. General Administration (SR) Department ద్వారా G.O.Ms.No.42 ద్వారా మార్చి 18, 2026 నుండి అమలులోకి వచ్చే విధంగా శాసనసభ విప్ల నియామకానికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. Chief Secretary K. రామకృష్ణ రావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

G.O.Ms.No.42, తెలంగాణ గవర్నర్ ముగ్గురు MLA లను మార్చి 18, 2026 నుండి అమలులోకి వచ్చే విధంగా తెలంగాణ శాసనసభ గవర్నమెంట్ విప్లుగా నియమించారు:

1. శ్రీ చింతకుంట విజయరమణ రావు, ఎమ్మెల్యే 

2. శ్రీ యెన్నాం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే 

3. శ్రీ వేముల వీరేశం, ఎమ్మెల్యే

శాసనమండలిలో విప్లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నియమితులయ్యారు. ఈ నియామకాలతో శాసనసభ, శాసనమండలి రెండింటిలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి విప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది.

శాసనసభలో పార్టీ సభ్యులు పార్టీ అధికారిక వైఖరికి అనుగుణంగా ఓటు వేసేలా, హాజరయ్యేలా నిర్ధారించడం విప్ పని. ముఖ్యమైన ఓటింగ్ సమయాల్లో ‘Whip జారీ’ చేస్తే ఆ పార్టీ సభ్యులు తప్పనిసరిగా హాజరై అదేవిధంగా ఓటు వేయాలి. విప్ను అతిక్రమిస్తే anti-defection law కింద సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉంది.

విశ్లేషణ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన చాలా కాలం తర్వాత శాసనసభ విప్ల అధికారిక నియామకం జరిగింది. ముగ్గురు విప్లను నియమించడం.. ఇది శాసనసభలో పార్టీ క్రమశిక్షణను పటిష్ఠంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి సంకేతం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షంతో జరిగే చర్చలు, బిల్లులు, ఓటింగ్ల్లో ఈ విప్లు కీలక పాత్ర నిర్వహిస్తారు.

Share
Share