Breaking News: ₹3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?

హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: తెలంగాణ డిప్యూటీ CM మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం (మార్చి 20) శాసనసభలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడవ పూర్తి స్థాయి బడ్జెట్ మొత్తం ₹3,24,234 కోట్లు. ఆరు గ్యారెంటీలకు ₹50,713 కోట్లు కేటాయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం.. వంటి వాటిని ముఖ్య వాటిలో చేర్చారు.

అంశంమొత్తం
మొత్తం బడ్జెట్ అంచనా₹3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం₹2,34,406 కోట్లు
క్యాపిటల్ వ్యయం₹47,267 కోట్లు
గత సంవత్సరం కంటే పెరుగుదల₹19,269 కోట్లు (6.3% అధికం)
6 గ్యారెంటీలకు కేటాయింపు₹50,713 కోట్లు
GSDP వృద్ధి రేటు (2025-26)10.7%.. జాతీయ 8% కంటే అధికం
తెలంగాణ తలసరి ఆదాయం₹4,18,931.. జాతీయ సగటు ₹2,19,575 కంటే 1.9 రెట్లు
శాఖకేటాయింపు
వ్యవసాయం₹23,179 కోట్లు (అతి పెద్ద కేటాయింపు)
విద్యుత్ / ఎనర్జీ₹21,285 కోట్లు
నీటిపారుదల / ఇరిగేషన్₹22,615 కోట్లు
మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి₹17,907 కోట్లు
రవాణా, రోడ్లు & భవనాలు₹12,789 కోట్లు
వైద్య & ఆరోగ్య శాఖ₹13,679 కోట్లు
విద్యా శాఖ₹26,674 కోట్లు
మహిళలు & శిశు సంక్షేమం₹3,143 కోట్లు
పరిశ్రమలు₹3,490 కోట్లు
పర్యాటకం₹1,224 కోట్లు
SC సంక్షేమం₹11,784 కోట్లు
BC సంక్షేమం₹12,511 కోట్లు
ST సంక్షేమం₹7,937 కోట్లు
రాజీవ్ యువ వికాసం₹6,000 కోట్లు

కాంగ్రెస్ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలకు మొత్తం ₹50,713 కోట్లు కేటాయించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, మహిళలకు ₹2,500 భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, పింఛన్లు, నిరుద్యోగ భత్యం పథకాల అమలు ఉన్నాయి. అయితే ఈ అమలు దశలవారీగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్: 1.15 కోట్ల కుటుంబాలకు ₹5 లక్షల జీవిత బీమా, జూన్ 2, 2026 నుండి అమలు… ₹4,000 కోట్లు కేటాయింపు. రాజీవ్ యువ వికాసం: SC, ST, BC, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం ₹6,000 కోట్లు. చేయూత విస్తరణ: 2 లక్షల కొత్త పింఛన్లు మంజూరు. 118 ATC సెంటర్లలో శిక్షణ పొందే ట్రైనీలకు నెలకు ₹2,000 స్కాలర్షిప్.

Young India Integrated Residential Schools కి ₹5,000 కోట్లు. Telangana Public Schools ఏర్పాటు.. Pre-Primary నుండి Class 12 వరకు ₹500 కోట్లు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మిడ్-డే మీల్స్ విస్తరణ ₹100 కోట్లు. Breakfast Scheme: Pre-Primary నుండి Intermediate వరకు మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి మాల్ట్ ₹720 కోట్లు. ఉస్మానియా యూనివర్సిటీకి ₹1,000 కోట్లు.

GHMC తో పాటు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కలిపి Greater Hyderabad, Cyberabad, Medchal-Malkajgiri అనే మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరణ. 30,000 ఎకరాల ‘Bharat Future City’ ప్రాజెక్టు.. Machilipatnam పోర్ట్ వరకు Greenfield National Highway, భూగర్భ విద్యుత్ వ్యవస్థ. Hyderabad Metro Rail Phase 2 & 3 కొనసాగింపు. Musi Riverfront Development కి నిధులు.

  “2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ — తెలంగాణ Rising లక్ష్యం” భట్టి విక్రమార్క

అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 వరకు చెల్లించాల్సిన మొత్తం ₹34,058 కోట్ల నుండి ₹11,915 కోట్లకు తగ్గించారు. దీంతో ₹22,142 కోట్ల నగదు ప్రవాహ ఉపశమనం కలిగింది.

విశ్లేషణ: ₹3.24 లక్షల కోట్ల బడ్జెట్ పరిమాణపరంగా ambitious. 6 గ్యారెంటీలకు ₹50,713 కోట్లు కేటాయించడం.. కనీసం ప్రయత్నం జరిగిందని చెప్పవచ్చు. అయితే revised estimate సాధారణంగా budget estimate కంటే తక్కువగా ఉంటుంది.. 2025-26లో ₹3.04 లక్షల కోట్ల బడ్జెట్ revised estimate ₹2.81 లక్షల కోట్లకు తగ్గింది. ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉంది. Infrastructure-heavy బడ్జెట్ దీర్ఘకాలంలో మంచిదే.. కానీ అప్పుల భారం నిజమైన concern. GSDP 10.7% వృద్ధి, తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రెట్టింపు.. ఇవి నిజంగా impressive గణాంకాలు.

Share
Share