Breaking News: కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు…ఇద్దరు టీచర్ల మృతి

తుంగతుర్తి, ఏపీబీ న్యూస్: విధి రాత…వారందరూ ఉపాధ్యాయులు, అందరూ కలిసి స్కూల్ రీ ఓపెన్ చేద్దామని కారులో బయలుదేరారు, ఇంతలోనే విధి వారిని మృత్యు వడిలోకి చేర్చింది. ఇక వివరాల్లోకి వెళితే నల్గొండ నుండి తుంగతుర్తి బయలుదేరిన ఐదుగురు ఉపాధ్యాయుల కారు జాజిరెడ్డిగూడెంలో అదుపుతప్పి రోడ్డు పక్కన వద్ద మల్టీ కొట్టింది.

teachers killed in road accident near Jajireddygudem 1

మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒక ఉపాధ్యాయురాలు కల్పన స్పాట్లోనే మృతి చెందగా, మరో ఇద్దరు హెడ్మాస్టర్లు రావులపల్లి హెడ్మాస్టర్ మరొక హెడ్మాస్టర్ తులసిలకు తీవ్ర గాయాలు, 108 అంబులెన్స్ లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. తుంగతుర్తి జిహెచ్ఎం ప్రవీణ్, రావులపల్లి జిహెచ్ఎం గీత, అన్నారం జిహెచ్ఎం సునీతరాణి, కస్తూర్బా గాంధీ ఏఎస్ఓ కల్పన కలరు. అల్వల ప్రవీణ్ కుమార్, అల్వల సునీత అన్నా చెల్లెలు. కల్పన స్పాట్ లోనే మృతి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

teachers killed in road accident near Jajireddygudem 2
Share
Share