చైనా మాంజా అమ్ముతున్న ఆరుగురిపై కేసులు నమోదు: జిల్లా ఎస్పీ

సూర్యాపేట, ఏపీబీ న్యూస్​: జిల్లాలో చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధించడం జరిగిందని వీటిపై జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా నిఘా ఉంచి ఉక్కుపాదం మోపుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, అక్రమంగా చైనా మాంజా అమ్ముతున్న ఆరుగురు వ్యక్తులపై ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.

పిల్లలు ఆడుకునే గాలిపటం కు సీసపు దారంతో కూడిన చైనా మాంజాను ఉపయోగించడం వల్ల ప్రయాణ సమయంలో వ్యక్తుల మెడకు, పక్షులకు తగిలి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీహెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఎవరైనా చైనా మాంజా అమ్ముతూ పట్టుబడినట్లైతే అలాంటి వారిపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేయడము, బైండోవర్ చేయడం లాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Share
Share