- 475 పోలింగ్ కేంద్రాలు,
- 70 మంది ఆర్వో లు
- 68 మంది ఏఆర్వోలు నియామకం: కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని, జిల్లాలో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రిజర్వేషన్లు అమలు చేశామని, 70 మంది ఆర్వో లు, 68 మంది ఏఆర్వోలను నియమించామని, వివిధ నోడల్ టీములను ఏర్పాటు చేశామని, నోడల్ అధికారుల శిక్షణ, నామినేషన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ,కౌంటింగ్ సెంటర్లు, సదుపాయాలు కల్పిస్తున్నామని, సీసీ కెమెరాల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టర్ అధికారుల నియామకం ఇప్పటికే పూర్తి చేశామని , శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీ పరిధిలో 104 వార్డులకు గాను మొత్తం 212 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పేపర్ ముద్రణ, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, మూత్రశాలను ర్యాంపులు, దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎఫ్ ఎస్ టి(FST),ఎస్ ఎస్ టి(SST)ల టీములకు శిక్షణ తరగతులు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు.
అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వివరాలను అప్లోడ్ చేయటం, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, వివిధ రకాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సూచనలు చేశారు.