- రోడ్ భద్రత నియామలను తప్పక పాటించాలి
- జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల లో విస్తృత అవగాహన కల్పించండి.
- నెల రోజులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: పొన్నం ప్రభాకర్
యాదగిరిగుట్ట, ఏపీబీ న్యూస్: ఈ నెలలో జరిగే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన పోస్టర్ ను, ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ తో కలసి మంత్రి, ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 30 వరకు నెల రోజుల పాటు రోడ్ సేఫ్టీ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. రోడ్ ప్రమాదాలను నివారించెందుకు నిబంధనల విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి, డైవ్రింగ్ లైసెన్స్ పొందిన ప్రతి వారికి రోడ్డు భద్రత నిబంధనలను తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ వాణి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, ఆర్ టి ఎ నర్సింహా,జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.