ఏఎస్​ఐ వెంకటరెడ్డి సేవలు అభినందనీయం.. ఇంటిలిజెన్స్​ విభాగంలో విశిష్ట సేవలు: ఎస్పీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఇంటిలిజెన్స్ విభాగంలో ఏఎస్ఐ(ASI)గా పనిచేసిన తుమ్మలపల్లి వెంకట రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన డిపార్ట్మెంట్కు విశిష్ట సేవలు అందించారని ఎస్పీ(SP) ఎం. శ్రీనివాసులు అన్నారు. ఆదివారం నల్లగొండలో వెంకటరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిపార్ట్మెంట్ పరంగా ఆయన అందించిన సూచనలు, సలహా లు, సమాచారం ప్రభుత్వానికి ఎంతోగానో దోహదపడ్డాయని అన్నారు. రేయిపగలు అనే తేడా లేకుండా డిపార్ట్మెంట్ అవసరం నిమిత్తం ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారని, అలాంటి ఏఎస్ఐ డిపార్ట్మెం ట్లో చాలా అరుదుగా ఉంటారని, వృత్తిరీత్యా పదవీ విరమణ సహజమే అయినప్పటికీ ఆయన లేనిలోటు డిపార్ట్మెంట్లో స్పష్టంగా కనిపిస్తందని ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు గోపినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీ కుటుంబ సభ్యులతో కలిసి వెంకట రెడ్డిని సత్కరించారు.

Share
Share